e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి నిరుపేదల ఆకలి తీరుస్తాం

నిరుపేదల ఆకలి తీరుస్తాం

నిరుపేదల ఆకలి తీరుస్తాం

ఉప్పల్‌, మే 23 : నియోజకవర్గంలో ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బందిపడకుండా చూస్తున్నామని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలుస్తుందన్నారు. ఉప్పల్‌ డివిజన్‌లో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి సహకారంతో టీఆర్‌ఎస్‌ పార్టీ డివిజన్‌ అధ్యక్షుడు వేముల సంతోష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు జరిగే ఆహార పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి హాజరై ఆహార ప్యాకెట్లను అందజేశారు. కార్యక్రమంలో చింతల నర్సింహారెడ్డి, టంటం వీరేశ్‌, స్వీట్‌హౌస్‌ రాజు, అన్య వెంకటేశ్‌, వేముల వెంకట్‌రెడ్డి, సత్యపాల్‌రెడ్డి, మస్క సుధాకర్‌, శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

కరోనా మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

ఉప్పల్‌ డివిజన్‌లోని సాయిబాబాకాలనీలో కరోనా వ్యాధితో మృతి చెందిన ఆటోడ్రైవర్‌ పోయికాడి విష్ణు కుటుంబానికి ఆదివారం ఆర్థిక సహాయం అందజేశారు. డివిజన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు వేముల సంతోష్‌రెడ్డి ఆధ్వర్యంలో మృతుడి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం వారికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో గడ్డం రవికుమార్‌, గరిక సుధాకర్‌, చింతల నర్సింహారెడ్డి, వేముల వెంకట్‌రెడ్డి, మస్క సుధాకర్‌, స్వీట్‌హౌస్‌ రాజు, అన్య వెంకటేష్‌, సాయిరాజ్‌రెడ్డి పాల్గొన్నారు.

అన్నపూర్ణ ఆహార కేంద్రంలో..

ఉప్పల్‌లోని ఐడీఏ ప్రాంతంలో అన్నపూర్ణ ఆహార కేంద్రంలో ఉప్పల్‌ కార్పొరేటర్‌ మందుముళ్ల రజితాపరమేశ్వర్‌రెడ్డి హాజరై ఆదివారం ఆహారం పంపిణీ చేశారు. మాజీ కార్పొరేటర్‌ పరమేశ్వర్‌రెడ్డి, లూకాస్‌, గోపాల్‌, అశోక్‌గౌడ్‌, మీసాల రాములు, ఉపేందర్‌రెడ్డి, నర్సింహ, సందీప్‌, భాస్కర్‌, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నిరుపేదల ఆకలి తీరుస్తాం

ట్రెండింగ్‌

Advertisement