సోమవారం 30 నవంబర్ 2020
Medchal - Jun 30, 2020 , 01:15:44

ట్రా'ఫికర్‌'

ట్రా'ఫికర్‌'

సరూర్‌నగర్‌ చౌరస్తాలో వాహనాల రద్దీ

ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు 

సిగ్నల్స్‌ ఏర్పాటు చేయాలని వేడుకోలు

ఆర్కేపురం:  సరూర్‌నగర్‌ పోస్టాఫీస్‌ చౌరస్తాలో ట్రాఫిక్‌తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్ర ధాన చౌరస్తా  కావడంతో నిత్యం వేలాది వాహనాలు ఈ రహదారి  గుండా రాకపోకలు సాగిస్తుంటాయి.  రో డ్డు పక్కనే ఆటోలతో పాటు ద్విచక్రవాహనాలను నిలుపడంతో  ట్రాఫిక్‌ స్తంభించిపోతున్నది. చౌరస్తాలో సి గ్నల్స్‌ లేక పోవడంతో  వాహనాలు వేగంగా రావడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు వాపోతున్నారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, సిబ్బంది లేకపోవడంతో ప్రయాణికులు నరకయాతన చూస్తున్నారు. ఎల్బీగనర్‌, కొత్తపేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కర్మన్‌ఘాట్‌కు వెళ్లాలంటే ఈ చౌరస్తా నుంచే వెళ్లాలి. నాలుగు ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రోడ్డు కావడంతో  వాహనాల రద్దీ ఏర్పడుతుంది.  కొన్ని వాహనాలు రాంగ్‌ రూట్లో రా వడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.  

సిగ్నల్స్‌ ఏర్పాటు చేయాలి

ప్రధాన కూడళ్ల వద్ద  ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సిన  ట్రాఫిక్‌ పోలీసులు కనిపించడం లేదు. దీంతో వాహనదారులు  రాంగ్‌ రూ ట్లో వస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. అధికారులు స్పం దించి చౌరస్తాలో సిగ్నల్స్‌ ఏర్పాటు చేయాలి.          -నవీన్‌ కుమార్‌, స్థానికుడు

సమస్యను పరిష్కరిస్తాం

సరూర్‌నగర్‌ చౌరస్తా వద్ద ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరిస్తాం. ట్రాఫిక్‌ సిబ్బంది విధులు నిర్వహించేలా చూస్తాం. వాహనదారులు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలి. ఆటో డ్రైవర్లు చౌరస్తా వద్ద ట్రాఫిక్‌ సమస్య ఏర్పడకుండా ఆటోలను నిలుపుకోవాలి.                 - నాగమల్లు, ట్రాఫిక్‌ ఇన్‌చార్జి సీఐ, ఎల్సీనగర్‌