e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి కొవిడ్‌ వేళ.. తల్లులకు భరోసా..

కొవిడ్‌ వేళ.. తల్లులకు భరోసా..

కొవిడ్‌ వేళ.. తల్లులకు భరోసా..
  • సందేహాల నివృత్తి.. వైద్య సలహాల కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌
  • 24/7 సేవలు అందుబాటులో..

మేడ్చల్‌, మే 6(నమస్తే తెలంగాణ): కరోనా వేళ .. గర్భిణులు, పాలు ఇచ్చే తల్లులు ఇబ్బందులు పడకుండా.. వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ భరోసా కల్పిస్తున్నది. సురక్షిత మాతృత్వం కోసం, ఇతర వైద్య సలహాలు, సూచనలతో పాటు సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. 24 గంటల పాటు స్త్రీ వ్యాధి, చిన్నపిల్లల వైద్యనిపుణులు అందుబాటులో ఉండి..తగిన సలహాలతో పాటు అవసరమైన వారికి సేవలందిస్తారు.

మేడ్చల్‌ జిల్లాలోని మేడ్చల్‌, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌ నియోజకవర్గాల్లోని గర్భిణులు, పాలు ఇచ్చే తల్లులు వారి కుటుంబసభ్యుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 180059912345 ఏర్పాటు చేసినట్లు వైద్యశాఖాధికారులు వెల్లడించారు. అలాగే జిల్లావ్యాప్తంగా పాజిటివ్‌ వచ్చిన గర్భిణులకు సేవలందించేందుకు, అత్యవసర ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు 73824 71061, 7382482399 నంబర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. ప్రసవ సేవల కోసం జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని సైతం నెలకొల్పారు. ఇప్పటివరకు 51 మంది గర్భిణులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొవిడ్‌ వేళ.. తల్లులకు భరోసా..

ట్రెండింగ్‌

Advertisement