బుధవారం 28 అక్టోబర్ 2020
Medchal - Sep 22, 2020 , 00:57:21

ప్రభుత్వం ప్రతి హామీని నిలబెట్టుకున్నది

ప్రభుత్వం ప్రతి హామీని నిలబెట్టుకున్నది

 గాజులరామారం : ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిలబెట్టుకున్నదని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్‌ అన్నారు. సోమవారం గాజులరామారం డివిజన్‌ పరిధిలోని ఉషోదయాకాలనీ ఫేజ్‌ -2, మెట్టుకానిగూడ ఫేజ్‌ -1, పోచమ్మబస్తీ కాలనీల్లో రూ. 50 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు ఆయనతో పాటు కార్పొరేటర్‌ రావుల శేషగిరిరావు పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో స్థానిక సమస్యలపై పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మంత్రి కేటీఆర్‌ సహకారంతో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు విజయరామిరెడ్డి, నాయకులు ఇంద్రసేనగుప్త, కస్తూరి బాల్‌రాజు, రషీద్‌బేగ్‌, సుంకరి సాయి ప్రతాప్‌, కమలాకర్‌, పరుష శ్రీనివాస్‌యాదవ్‌, నవాబ్‌, అబిద్‌, పున్నారెడ్డి, ఇబ్రహీం, ఇమ్రాన్‌బేగ్‌, శివ ముదిరాజ్‌, మహిళా నాయకురాలు సంధ్య, వార్డు కమిటీ సభ్యులు లాల్‌ మహమ్మద్‌, అజయ్‌ ప్రసాద్‌గుప్త, మల్లేశ్‌, ఖుర్షిద్‌బేగం, సురేశ్‌, మసూద్‌, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు. 

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి 

 రంగారెడ్డి, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్‌ అన్నారు. సోమవారం గాజులరామారం డివిజన్‌ పరిధిలోని మహరాజా గార్డెన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయనతో పాటు కార్పొరేటర్‌ రావుల శేషగిరిరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ప్రతి వార్డుకు ఒక ఇన్‌చార్జిని నియమించి ఈ నెల 21 వరకు పట్టభద్రుల జాబితా రూపొందించాలన్నారు. వచ్చే నెల 1వ తేదీ వరకు జాబితాలోని పట్టభద్రుల నుంచి ఓటరు నమోదు కోసం దరఖాస్తుతో పాటు ధ్రువీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు విజయరామిరెడ్డి, సీనియర్‌ నాయకులు ఇంద్రసేనగుప్త, కస్తూరి బాల్‌రాజు, రషీద్‌బేగ్‌, సుంకరి సాయి ప్రతాప్‌, కమలాకర్‌, నవాబ్‌, అబిద్‌, మహిళా నాయకురాలు సంధ్యారెడ్డి, టీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు సాయి, సెక్రటరీ నవీన్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు తారాసింగ్‌, మైనార్టీ అధ్యక్షుడు అబ్బు, బీసీ సెల్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయకులు పున్నారెడ్డి, వార్డు కమిటీ సభ్యులు లాల్‌ మహమ్మద్‌, మల్లేశ్‌, అజయ్‌ ప్రసాద్‌గుప్త, ఖుర్షిద్‌బేగం, మంజుల, మెట్టుకానిగూడ శ్రీనివాస్‌, ఆంజనేయులు, నారాయణ, మురళీకృష్ణ, ఇబ్రహీం ఖాన్‌, యండి. ఇబ్రహీం, సిహెచ్‌.వెంకటేశ్‌, ఇమ్రాన్‌బేగ్‌, నాగభూషణం, నగేశ్‌ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


logo