గురువారం 21 జనవరి 2021
Medchal - Dec 05, 2020 , 02:31:49

యువతకే పట్టాభిషేకం

యువతకే పట్టాభిషేకం

గెలిచిన వారిలో విద్యావంతులే అధికం

యువతులదే పైచేయి

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఓటర్లు యువ నాయకులకు పట్టంకట్టారు. గ్రేటర్‌ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి గెలిచిన మొత్తం 150 అభ్యర్థుల్లో సుమారు 50 శాతం మంది అభ్యర్థులు యువ నాయకులు కాగా, వీరిలో 80శాతం మంది మహిళా నాయకులు ఉం డటం విశేషం. ఇందులో 2016తోపాటు 2020 గ్రేటర్‌ ఫలితాల్లోనూ విజయం సాధించిన అభ్యర్థులున్నారు. ఈ దఫా ఎన్నికల్లో ఎక్కువ శాతం విద్యావంతులే గెలవడం మరో విశేషం. గ్రేటర్‌ పాలకవర్గంలో యువ నాయకుల ప్రాతినిధ్యం పెరగడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.  

గెలిచిన యువ అభ్యర్థుల వివరాలు..

రచన శ్రీ గోడ్చల్‌ (బీజేపీ) కవాడిగూడ, బండారి రాజ్‌కుమార్‌ పటేల్‌ (టీఆర్‌ఎస్‌) యూసుఫ్‌గూడ, శిరీషరెడ్డి సింగిరెడ్డి - (కాంగ్రెస్‌) ఏఎస్‌రావు నగర్‌, వి.సింధు ఆదర్శ్‌ రెడ్డి - (టీఆర్‌ఎస్‌) భారతీ నగర్‌, చింతల విజయశాంతి (టీఆర్‌ఎస్‌) అల్వాల్‌, బాబా ఫసియుద్దీన్‌ (టీఆర్‌ఎస్‌) బోరబండ, అరుణ.సీహెచ్‌ (బీజేపీ) నాగోల్‌, గంగాధర్‌ రెడ్డి (బీజేపీ) గచ్చిబౌలి, కొంతం దీపిక (బీజేపీ) మోండా మార్కెట్‌, లావణ్య దూసరి (టీఆర్‌ఎస్‌) గోల్నాక, కేతినేని సరళ (బీజేపీ) అమీర్‌పేట, సామల హేమ (టీఆర్‌ఎస్‌) సితాఫల్‌మండి, అనుగుల పావని (బీజేపీ) గాంధీనగర్‌, మన్నె కవిత (టీఆర్‌ఎస్‌) వెంకటేశ్వర నగర్‌ కాలనీ, జి.దేదీప్య (టీఆర్‌ఎస్‌) వెంగళ్‌రావు నగర్‌, చేతన కక్కిరేణి (బీజేపీ) హబ్సిగూడ, రాసూరి సునీత (టీఆర్‌ఎస్‌) మెట్టుగూడ, విజయారెడ్డి (టీఆర్‌ఎస్‌) ఖైరతాబాద్‌, పగడాల శిరీష (టీఆర్‌ఎస్‌) - బాలాజీ నగర్‌.


logo