తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ సార్

ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు
అల్వాల్ : ప్రొఫెసర్ జయశంకర్ సార్ కృషివల్లే శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా అల్వాల్ మీసేవా కేంద్రం వద్దనున్న జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అల్వాల్ మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మచ్చబొల్లారం కార్పొరేటర్ రాజ్ జితెందర్ నాథ్, అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్‌రెడ్డి, అనీల్ కిశోర్ గౌడ్, 134 డివిజన్ అధ్యక్షుడు ఉదయ్ నాయకులు పాల్గొన్నారు.
నేరేడ్మెట్ : తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మల్కాజిగిరి తహసీల్దార్ బానోతు గీత అన్నారు. గురువారం మల్కాజిగిరి తహసీల్దార్ కార్యాలయంలో జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.
మేడ్చల్ జోన్ బృందం : తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్, శామీర్‌పేట, కీసర, ఘట్కేసర్, మూడుచింతలపల్లి మండలాలు, బోడుప్పల్, పీర్జాది గూడ, జవహర్‌నగర్ కార్పొరేషన్లు, మేడ్చల్, గుండ్లపోచంపల్లి, తూం కుంట, ఘట్కేసర్, పోచారం, దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద ఆయన చిత్రపటానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు.
తాజావార్తలు
- అమెజాన్ ‘బ్లూ ఆరిజన్’ సక్సెస్
- ప్రజావైద్యుడు లక్ష్మణమూర్తి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- ప్రభాస్ ‘సలార్’ లేటెస్ట్ అప్డేట్.. హీరోయిన్.. విలన్ ఎవరో తెలుసా?
- బెంగళూరు హైవేపై ప్రమాదం : ఒకరు మృతి
- వైద్య సిబ్బంది సేవలు మరువలేం : మంత్రి సబిత
- మన భూమి కంటే పెద్ద భూమి ఇది..!
- టీకా రాజధానిగా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్
- ‘శశి’ వచ్చేది ప్రేమికుల రోజుకే..
- టీకా సంరంబం.. కరోనా అంతం !
- పేదలకు ఉచితంగా టీకాలు ఇవ్వాలి: పంజాబ్ సీఎం