e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News గుర్తింపు పొందిన ఏజెంట్ల ద్వారానే వెళ్లాలి

గుర్తింపు పొందిన ఏజెంట్ల ద్వారానే వెళ్లాలి

గుర్తింపు పొందిన ఏజెంట్ల ద్వారానే వెళ్లాలి

మేడ్చల్‌, మే 20(నమస్తే తెలంగాణ): విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ వద్ద నమోదు చేసుకున్న ఏజెంట్ల ద్వారా మాత్రమే వెళ్లాలని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతా మహంతి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం విదేశాలకు అక్రమంగా వెళ్లి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు.. వారికి అవగాహన కల్పించేందుకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ 40 సెకండ్ల నిడివిగల విజువల్స్‌తో కూడిన వీడియోను రూపొందించిందన్నారు. ప్రధానంగా భారతీయులు విదేశాల్లో ఉద్యోగాలకు సురక్షితంగా, న్యాయబద్దంగా వెళ్లడానికి తగు సలహాలు, సూచనలు ఇవ్వడానికి టోల్‌ నం. 1800113090 ఏర్పాటు చేసిందని తెలిపారు. విదేశాలకు వెళ్లేవారు ఏ ఉద్యోగం కోసం వెళ్తున్నారో అందులో శిక్షణ పొంది వెళ్లాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ సూచించారు. ముఖ్యంగా నకిలీ ఏంజెట్లను నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే భారతీయ రాయబార కార్యాలయంలో సంప్రదించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ సూచించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గుర్తింపు పొందిన ఏజెంట్ల ద్వారానే వెళ్లాలి

ట్రెండింగ్‌

Advertisement