మంగళవారం 27 అక్టోబర్ 2020
Medchal - Sep 26, 2020 , 00:50:02

టీఆర్‌ఎస్‌లో చేరిన ఉప సర్పంచ్‌

టీఆర్‌ఎస్‌లో చేరిన ఉప సర్పంచ్‌

మేడ్చల్‌ రూరల్‌ : మండల పరిధిలోని గౌడవెల్లి గ్రామ ఉప సర్పంచ్‌ పెంటమ్మ, వార్డు సభ్యులు గణేశ్‌ యాదవ్‌, మల్లికార్జున్‌తో పాటు పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి మల్లారెడ్డి సమక్షంలో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సింహాల్‌ ఆధ్వర్యంలో గులాబీ గూటికి చేరుకున్నారు.  పీఏసీఎస్‌ చైర్మన్‌ రణదీప్‌రెడ్డి, గ్రామ అధ్యక్షుడు సంతోషభాను, మాజీ సర్పంచ్‌లు జగన్‌రెడ్డి, యాదగిరి యాదవ్‌,  పీఏసీఎస్‌ డైరెక్టర్‌ కృష్ణ యాదవ్‌ పాల్గొన్నారు. 
logo