e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 25, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి వెంటబడి కరుస్తున్నాయి

వెంటబడి కరుస్తున్నాయి

  • కుషాయిగూడలో కుక్కల స్వైర విహారం 
  • ముగ్గురిపై దాడి.. గాయాలు 
  • భయం నీడలో బస్తీల ప్రజలు
  •  చర్యలు తీసుకుంటున్నాం: డీసీ కాప్రా సర్కిల్‌

చర్లపల్లి, మార్చి 18 :  చర్లపల్లి డివిజన్‌ పరిధిలోని పలు కాలనీల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. దీంతో కుషాయిగూడ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ఒక్కరోజే కుక్కలు ముగ్గురిపై దాడిచేసి, గాయపరిచాయి. గురువారం జరిగిన సంఘటనల వివరాలిలా ఉన్నాయి.. కుషాయిగూడలో ప్రభుత్వ మూత్రశాలల నిర్వాహకురాలైన నరసమ్మ రోజుమాదిరిగా తన విధులు నిర్వర్తిస్తుండగా కుక్కలు గాయపర్చాయి. అదేవిధంగా.. శివసాయినగర్‌కు చెందిన కాసుల సృజన్‌కుమార్‌ రోజువారి మాదిరిగా స్కూల్‌కు వెళ్తుండగా కుషాయిగూడ పోచమ్మ ఆలయం వద్ద కుక్కలు దాడిచేసి గాయపర్చాయి. మరోసంఘటనలో కుషాయిగూడ ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న సందీప్‌ అనే వ్యక్తిని కుక్కలు గాయపర్చాయి. చాలా కాలంగా కుక్కలు దాడులు చేస్తున్నాయి.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాలంటూ భయమేస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని.. స్వచ్ఛంద సంస్థల పేరు చెప్పి చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

భయం నీడలో  బస్తీలు..

 కుషాయిగూడ, శివసాయినగర్‌, వాసవీశివనగర్‌, సోనియాగాంధీనగర్‌, నాగార్జుననగర్‌కాలనీ, వీఆర్‌రెడ్డికాలనీ, చక్రీపురం, మారుతీనగర్‌, టీచర్స్‌కాలనీ, న్యూగాంధీనగర్‌, భరత్‌నగర్‌, బీఎన్‌రెడ్డినగర్‌, ఈసీనగర్‌ తదితర ప్రాంతాల్లో వీధికుక్కల దాడులతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వీధి కుక్కల విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో భరత్‌నగర్‌లో కుక్కలు పలువురిని  గాయపర్చాయి.. సిబ్బంది వచ్చి నామమాత్రపు చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. సిబ్బంది సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఇరువై రోజుల కిందట  శివసాయినగర్‌, వాసవీశివనగర్‌, భరత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో రోడ్డు వెంబడి వెళుతున్న మహిళలు, విద్యార్థులను గాయపర్చిన సంఘటన స్థానికులు గుర్తు చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి కుక్కలను పట్టుకొని తరలించాలని స్థానికులు వేడుకుంటున్నారు.

చర్యలు తీసుకుంటున్నాం.. 

- Advertisement -

పీపుల్‌ ఫర్‌ యానిమల్‌ అనే స్వచ్ఛంద సంస్థ సహాయంతో వీధుల్లో తిరుగుతున్న కుక్కల దాడులను నివారించే చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నిఘా పెట్టి పట్టుకుంటున్నాం. బస్తీల్లో కుక్కలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి. తప్పకుండా సిబ్బంది వచ్చి చర్యలు తీసుకుంటారు. కుక్కలపై ప్రత్యేక చర్యల్లో భాగంగా యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌పై దృష్టి సారించాం. స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కూడా యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌పై దృష్టిసారించి పని చేస్తున్నారు. -శంకర్‌, డీసీ, కాప్రా సర్కిల్‌..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement