శనివారం 23 జనవరి 2021
Medchal - Dec 03, 2020 , 07:41:07

అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

  • మృతదేహం కోసం కుటుంబసభ్యుల ఎదురుచూపు
  • రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వేడుకోలు..

పీర్జాదిగూడ: అమెరికాలోని న్యూయార్క్‌ సిటీ బాపెల్లోలో నవంబర్‌ 27న అనారోగ్యంతో మృతి చెందిన మేడిపల్లికి  చెందిన  సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పానుగంటి శ్రీధర్‌ మృతదేహం కోసం కుటుంబసభ్యులు ఎదురు చూస్తున్నారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకుంటూ.. భార్య ఝాన్సీరాణి, కుమారుడు శ్రీజన్‌తో శ్రీధర్‌ నివాసముంటున్నాడు. ఆస్తమా కారణంగా రెండు రోజుల కిందట మృతి చెందాడు. అయితే శ్రీధర్‌ కుటుంబ సభ్యులకు అమెరికాలో తెలిసినవారెవరూ లేరు. దీంతో అక్కడి అధికారుల నుంచి స్పందన కూడా సరిగా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీధర్‌ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.  అమెరికా అధికారులతో మాట్లాడి.. మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించే విధంగా చూడాలని భార్య, కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. మృతుడి భార్య ఝాన్సీరాణి తన సోదరుడి వివాహం ఉండటంతో ఇటీవలే అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చారు.   


logo