శుక్రవారం 23 అక్టోబర్ 2020
Medchal - Sep 26, 2020 , 00:49:54

అరవై ఏండ్ల ప్రగతిని ఆరేండ్లలో చేశాం

అరవై ఏండ్ల ప్రగతిని ఆరేండ్లలో చేశాం

మంత్రి చామకూర మల్లారెడ్డి

రూ.4.87కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

బోడుప్పల్‌ కార్పొరేషన్‌లో 85 పార్కుల సుందరీకరణ

ఒక్కో డివిజన్‌కు రూ.కోటి చొప్పున 28 డివిజన్లకు నిధులు కేటాయింపు

బోడుప్పల్‌:  అరవై ఏండ్ల ప్రగతిని సీఎం కేసీఆర్‌ ఆరేండ్లలో చేసి చూపించారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం బోడుప్పల్‌ నగరపాలక సంస్థ పరిధిలో మంత్రి మల్లారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఆనంద్‌నగర్‌, సాయిరాంనగర్‌, సాయి భవానీ నగర్‌, శ్రీనివాస కాలనీ, తిరుమలామెడోస్‌, లక్ష్మీగణపతికాలనీ, బాలాజీహిల్స్‌, బయ్యన్న గూడ, ఇందిరానగర్‌, అంబేద్కర్‌ నగర్‌, దేవేందర్‌నగర్‌, ఆర్‌ఎన్‌ఎస్‌నగర్‌, మహలక్ష్మీనగర్‌, చెంగిచర్ల క్రాంతికాలనీ, వీఎస్‌ఎస్‌డీనగర్‌, దత్తాత్రేయనగర్‌ కాలనీ, లెక్చరర్‌ కాలనీ, శ్రీలక్ష్మినగర్‌ కాలనీ, వెస్ట్‌ హనుమాన్‌నగర్‌ ఆయా కాలనీల్లో రూ.4.87కోట్ల నిధులతో చేపట్లే సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

 సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి..

శుక్రవారం బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ..బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు అనంతరం రూ.85 కోట్ల నిధులతో పట్టణ అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు.105 పార్కులకు గాను 85 పార్కుల సుందరీకరణ పనులు పూర్తయ్యాయని తెలిపారు.

మరోసారి నిరుపేదల ప్లాట్లు క్రమబద్ధీకరిస్తాం..

58,59 జీవో ద్వారా బడుగు, బలహీన వర్గాల కోసం మరోసారి నిరుపేదల ఇంటిస్థలాలను క్రమబద్ధీకరించనున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఇంటి పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పింస్తున్నదన్నారు. కార్యక్రమంలో మేయర్‌ సామల బుచ్చిరెడ్డి, కమిషనర్‌ ఎన్‌.శంకర్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, డిప్యూటీ మేయర్‌ కొత్త లక్ష్మీరవిగౌడ్‌, కార్పొరేటర్లు బింగి జంగయ్యయాదవ్‌, కొత్త చందర్‌గౌడ్‌, సింగిరెడ్డి పద్మారెడ్డి, బొమ్మక్‌ కల్యాణ్‌, కొత్త శ్రీవిద్యకొత్త చక్రపాణిగౌడ్‌, పోగుల నర్సింహారెడ్డి, హేమలతాజంగారెడ్డి, జక్కల పద్మ, రాసాల వెంకటేశ్‌యాదవ్‌, డి.మహేశ్వరి, గుర్రాల రమా, బూక్యా సుమన్‌నాయక్‌, చీరాల నర్సింహ, కో-ఆప్షన్‌ సభ్యులు బ్రహ్మన్నగౌడ్‌, దత్తాత్రేయ శాస్త్రీ, బద్దుల సుగుణ, నాయకులు బాలయ్య, చక్రపాణిగౌడ్‌, శేఖర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, కొత్త రవిగౌడ్‌, గుర్రాల వెంకటేశ్‌, కృపాసాగర్‌,సత్యారాం, శేఖర్‌గుప్త పాల్గొన్నారు.
logo