శుక్రవారం 04 డిసెంబర్ 2020
Medchal - Sep 06, 2020 , 00:08:59

325 కిలోల గంజాయి పట్టివేత

325 కిలోల గంజాయి పట్టివేత

ముగ్గురు నిందితులు అరెస్ట్‌

బాలానగర్‌  :  బాలానగర్‌లో మొత్తం 325.6 కిలోల గంజాయిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకుని.. ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. శనివారం బాలానగర్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడ్చల్‌ జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ గణేశ్‌ వివరాలు వెల్లడించారు. జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సీఐ సహదేవ్‌ సిబ్బందితో కలిసి శుక్రవారం బాలానగర్‌లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో సంజీయ్‌శర్మ (45) అనే వ్యక్తి బైక్‌ను తనిఖీ చేయగా.. అందులో 2.2కిలోల గంజాయి లభించింది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా..అతడు చెప్పిన సమాచారం మేరకు  బాలానగర్‌లోని వీఆర్‌ఎల్‌ ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌లో తనిఖీ చేయగా  2.4 కిలోల గంజాయి లభించగా, నదీముల్లాఖాన్‌(38)ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు రివిగో ట్రాన్స్‌పోర్ట్‌లో 321 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, నిర్వాహకుడు సురేశ్‌శర్మను (35) అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు నిందితులను, మొత్తం 325.6 కిలోల గంజాయిని బాలానగర్‌ ఎక్సైజ్‌ పోలీసులకు అప్పగించారు.  ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.