శనివారం 31 అక్టోబర్ 2020
Medchal - Sep 20, 2020 , 01:34:39

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీదే విజయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీదే విజయం

కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి 

మేడ్చల్‌ కలెక్టరేట్‌ : హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గూలాబీదే విజయమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీలో శనివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటర్ల నమోదుపై టీఆర్‌ఎస్‌ నాయకులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ పరిధిలో ఉన్న అర్హులైన పట్టభద్రులను ఓటరుగా నమోదు చేయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో చైర్మన్‌ కౌకుట్ల చంద్రారెడ్డి, వైస్‌చైర్మన్‌ మల్లేష్‌ యాదవ్‌, అధ్యక్షుడు శ్రీధర్‌, నాయకులు కె.దయాకర్‌ రావు, శ్రీనివాస్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సురేష్‌, అనంత్‌ రెడ్డి పాల్గొన్నారు.

లక్ష్మీనర్సింహ మృతి పార్టీకి తీరని లోటు

కీసర : బిట్ల లక్ష్మీనర్సింహ మృతి పార్టీకి తీరని లోటని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం కీసర మండలం రాంపల్లిదాయరకు చెందిన టీఆర్‌ఎస్‌ నేత, మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్‌ బిట్ల లక్ష్మీనర్సింహ గుండెపోటు తో మృతిచెందాడు. శనివారం మంత్రి మల్లారెడ్డి స్థానిక నేతలతో కలిసి మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నర్సింహ కుటుంబానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇందిర, వైఎస్‌ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ రామిడి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీ నారాయణశర్మ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జె. సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.