ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Medchal - Aug 09, 2020 , 00:00:54

చిన్నకుంటలో మట్టి తొలిగింపు..

చిన్నకుంటలో  మట్టి తొలిగింపు..

కీసర : మండల పరిధిలోని చీర్యాల్‌ చిన్నకుంట సర్వేనంబర్‌ 152ను ఆనుకొని పార్కు ఏర్పాటుకు గ్రామపంచాయతీ అధికారులు ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నారు. ఈ మేరకు చీర్యాల్‌ పంచాయతీ అధికారులు, పాలకవర్గ సభ్యులు గ్రామంలో ఉన్న మరో చెరువునుంచి లారీలతో మట్టిని తీసుకొచ్చి చిన్నకుంటను పూడ్చి పార్కు ఏర్పాటు చేయాలని వారం రోజుల నుంచి ప్రయత్నాలు సాగిస్తున్నారు. చిన్నకుంటను ఆనుకొని ఉన్న హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ నిర్వాహకులతో కుమ్మక్కయ్యారని, రైతుల శిఖం భూముల కోసం మట్టిని పోస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో స్పందించిన తహసీల్దార్‌ నాగరాజు హుటాహుటిన స్థానిక వీఆర్‌ఏను అక్కడికి పంపించి చిన్నకుంటలో పోసిన మట్టిని జేసీబీ సహాయంతో తొలగించారు. చిన్నకుంటను పూడ్చిన వారిపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.


logo