గురువారం 26 నవంబర్ 2020
Medchal - Jul 28, 2020 , 22:53:52

మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేయండి

మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేయండి

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు మంత్రి మల్లారెడ్డి వినతి

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: మేడ్చల్‌ జిల్లాలోని మున్సిపాలిటీలలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు నిధులను విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు రా్రష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వినతి పత్రం అందించారు. నూతనంగా ఏర్పడిన జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.25.82 కోట్లను పలు అభివృద్ధి పనులకు కేటాయించామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల కారణంగా నిధుల విడుదలో జాప్యం జరిగిందని, ఈ నిధులను ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయాలని మల్లారెడ్డి కోరారు. అలాగే మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీనారాయణ చెరువు, నీళ్ల చెరువు, మేడ్చల్‌ పెద్ద చెరువు, ఎర్రకుంట చెరువు, తూంకుంట పెద్ద చెరువు, అన్నారాయన చెరువు, నాచిన చెరువు, రాంపల్లి చెరువు, చెన్నాపూర్‌ చెరువు, రావికుంట చెరువు, పరిమళకుంట చెరువు, చింతల్‌ చెరువు, రా చెరువు, పోచమ్మ చెరువులను అర్బన్‌ మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా మినీ ట్యాంక్‌ బండ్‌లుగా అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా మార్చాలని కేటీఆర్‌ను మల్లారెడ్డి కోరారు. తమ వినతిపై మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు.