శనివారం 31 అక్టోబర్ 2020
Medchal - Sep 23, 2020 , 00:44:18

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

 కుత్బుల్లాపూర్‌ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తున్నదని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అన్నారు. మంగళవారం కుత్బుల్లాపూర్‌ డివిజన్‌లో బాపూజీనగర్‌, వాజ్‌పేయ్‌నగర్‌లో రూ.56.5 లక్షల వ్యయంతో సీసీరోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు డివిజన్‌ అధ్యక్షుడు కేఎం. గౌరీశ్‌తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం అధికారులతో వివిధ ప్రణాళికలను రూపొందించి వాటి అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు రాకేశ్‌ జాలిగం, సాయిబాబా, శివ తదితరులు పాల్గొన్నారు.

ఓటరు నమోదును జయప్రదం చేయండి 

 త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన గ్రాడ్యుయేట్‌ను గుర్తించి వారికి ఓటు హక్కును కల్పించేలా కార్యకర్తలు క్రియాశీలకంగా పని చేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

కమ్యూనిటీహాల్‌కు స్థలం కేటాయింపు

 గాజులరామారం : నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వివేకానంద్‌ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం గాజులరామారం డివిజన్‌ పరిధిలోని దేవేందర్‌నగర్‌లో సర్వేనంబర్‌ 329/1లో నాయీ బ్రాహ్మణ కమ్యూనిటీహాల్‌ నిర్మాణానికి స్థలం కేటాయించారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ రావుల శేషగిరి, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు విజయరాంరెడ్డి, నాయిబ్రహ్మణ సేవాసంఘం జాతీయ అధ్యక్షుడు జగదీశ్‌నాయి, నియోజవర్గం అధ్యక్షుడు వెంకటేశ్‌నాయి, ప్రధాన కార్యదర్శి గణేశ్‌ నాయి పాల్గొన్నారు.