శనివారం 24 అక్టోబర్ 2020
Medchal - Sep 26, 2020 , 00:50:07

ప్రజా సంక్షేమమే ధ్యేయం

ప్రజా సంక్షేమమే ధ్యేయం

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

నేరేడ్‌మెట్‌ : మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తున్నదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం నేరేడ్‌మెట్‌ డివిజన్‌ యాప్రాల్‌ ఆండాల్‌హోమ్స్‌లో వివిధ కాలనీ సంక్షేమ సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్‌ కటికనేని శ్రీదేవి హన్మంతరావు, జడ్సీ శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి బస్తీ, కాలనీలో ప్రజలకు కావాల్సిన  సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీసీ దశరథ్‌, ఎస్‌ఈ అనిల్‌రాజ్‌, ప్రసాద్‌రావు, డీఈ సువర్ణ, ఏఈ సృజన, కాలనీ అధ్యక్షుడు శ్రీను, మల్లిక, నాయకులు లక్ష్మీకాంత్‌రెడ్డి, జీవకన్‌, గోకుల్‌కుమార్‌, ఉపేందర్‌రెడ్డి, చిత్ర, సాయి, ఎస్‌ఆర్‌ ప్రసాద్‌, ప్రేంకుమార్‌, సతీశ్‌కుమార్‌, రాముయాదవ్‌, ఏ.మహేశ్‌యాదవ్‌, శంకర్‌రావు,  శ్రీను పాల్గొన్నారు. logo