ఆదివారం 12 జూలై 2020
Medchal - Jun 04, 2020 , 02:00:49

కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు చర్యలు

కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు చర్యలు

భౌతికదూరం పాటిస్తూ విధులు

జాగ్రత్తలు తీసుకుంటున్న పోలీసు సిబ్బంది

 కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూ అందరిలోనూ ఆందోళన కలిగిస్తున్నది. కొవిడ్‌ కారణంగా పోలీసు సిబ్బంది సైతం బాధితులవుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలపై సైబారాబాద్‌ పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే పలు ఆదేశాలను జారీ చేశారు. విధి నిర్వహణతో పాటు వ్యక్తిగతంగా కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సీపీ సజ్జనార్‌ సూచించారు. నగరంలోని ఆయా ఠాణాల్లో పని చేస్తున్న పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్న తరుణంలో కేపీహెచ్‌బీ ఠాణాలో పోలీసు అధికారులు మరిన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు. - హైదర్‌నగర్‌

తమ సమస్యలను తెలుపుకునేందుకు నిత్యం కేపీహెచ్‌బీ ఠాణాకు సుమారు 100 నుంచి 150 మంది వచ్చి వెళ్తున్నట్లు అంచనా. అయితే బాధితుల వెంట గరిష్టంగా కేవలం ఇద్దరు మాత్రమే వచ్చేలా చూస్తున్నారు. మాస్కు లేకుండా ఏ ఒక్కరినీ పోలీస్‌ స్టేషన్‌లోకి అనుమతించడం లేదు. స్టేషన్‌లో మొదటి దశలో ఉండే స్వాగత సేవల వద్ద సిబ్బంది చాంబర్‌కు మూడు అడుగుల దూరంలోనే ఉండి బాధితులు తమ సమస్యను విన్నవించుకునేలా ఏర్పాటు చేశారు. బయట నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ సబ్బుతో చేతులు కడుక్కునేలా వసతులు కల్పించారు. ఠాణా లోపల సైతం భౌతికదూరాన్ని పాటించేలా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. 

మొత్తం సిబ్బంది 90..

కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ నుంచి కింది స్థాయి హోంగార్డు వరకు మొత్తం 90 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో ఇద్దరు సీఐలు, ఏడుగురు ఎస్సైలు, ఆరుగురు ఏఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఉన్నారు. మొత్తం సిబ్బందిలో సుమారు 10 నుంచి 15 మంది మినహా మిగిలిన వారు షిఫ్ట్‌ల వారీగా విధులు నిర్వర్తిస్తున్నారు. 


logo