గురువారం 22 అక్టోబర్ 2020
Medchal - Sep 01, 2020 , 23:33:48

ప్రణబ్‌ సేవలు మరువలేనివి

ప్రణబ్‌ సేవలు మరువలేనివి

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కేపీహెచ్‌బీ కాలనీ : భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దేశానికి అందించిన సేవలు మరువలేనివని కూకట్‌పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కేపీహెచ్‌బీ కాలనీ గోపాల్‌నగర్‌ కాలనీలో ప్రణబ్‌ ముఖర్జీ చిత్ర పటానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్‌ మందడి శ్రీనివాస్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ 50 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులను సమర్థవంతంగా నిర్వహించారని, కేంద్ర ప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖలతో సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నరు. రాష్ట్రపతిగా ఆయన అందించిన సేవలు గొప్పవని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతిగా ప్రణబ్‌ సంతకం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తనవంతు పాత్రను పోషించిన ప్రణబ్‌ ముఖర్జీకి ప్రజల తరపున నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మూసాపేట సర్కిల్‌ ఉప కమిషనర్‌ రవికుమార్‌, డివిజన్‌ ఇన్‌చార్జి అడుసుమల్లి వెంకటేశ్వర్‌రావు, అధ్యక్షుడు మందలపు సాయిబాబా చౌదరి, గోపాల్‌నగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

కూకట్‌పల్లి: కూకట్‌పల్లి డివిజన్‌ పరిధిలోని అంబ్కేదర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ నాయకులు మూసాపేట్‌ డివిజన్‌ ఓబీసీ సెల్‌ అధ్యక్షుడు తూము సంతోష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సంతాప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ గొట్టి ముక్కల వెంగళ్‌రావు, రాఘవేందర్‌రావు, గంధం ఏసు రాజు, రాజేందర్‌, సుభాశ్‌ గౌడ్‌, ఎడ్ల ప్రభాకర్‌, మేకల రమేశ్‌, అస్లాం, రంగస్వామి, జావేద్‌ అలీ, ప్రవీణ్‌, సతీశ్‌ రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎర్రగడ్డ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి టీఆర్‌ఎస్‌ నేతలు నివాళులర్పించారు. బోరబండలోని డిప్యూటీ మేయర్‌ క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన సంతాప సభలో ప్రణబ్‌ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు కృష్ణమోహన్‌తో పాటు నాయకులు పాల్గొన్నారు.logo