బుధవారం 21 అక్టోబర్ 2020
Medchal - Aug 20, 2020 , 00:40:31

గ్రీన్‌ చాలెంజ్‌లో ప్రజలు భాగస్వాములు కావాలి

గ్రీన్‌ చాలెంజ్‌లో ప్రజలు భాగస్వాములు కావాలి

ప్రతాపసింగారంలో మొక్కలు నాటిన కలెక్టర్‌

ఘట్‌కేసర్‌ : గ్రీన్‌ చాలెంజ్‌లో ప్రజలు భాగస్వాములు కావాలని, ప్రతి ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.  ఆరో విడుత హరితహారం, గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా ఘట్‌కేసర్‌ మండలం ప్రతాపసింగారం ప్రభుత్వ పాఠశాలలో జడ్పీచైర్మన్‌ మలిపెద్ది శరత్‌ చంద్రారెడ్డితో కలిసి బుధవారం ఆరు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ  ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో గుర్తించి మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అప్పుడే ఆశించిన హరిత తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని ఈ సమయంలో మొక్కలు నాటితే  పెరుగుతాయని కలెక్టర్‌  ప్రజా ప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, సర్పంచ్‌ ఒంగూరి శివకుమార్‌, ఎంపీడీఓ అరుణ, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కందుల కుమార్‌, నాయకులు బొక్క ప్రభాకర్‌ రెడ్డి, బద్దం కుమార్‌,గ్రామస్తులు పాల్గొన్నారు.


logo