గురువారం 22 అక్టోబర్ 2020
Medchal - Aug 12, 2020 , 00:01:51

అభివృద్ధి పనులు పరిశీలన

అభివృద్ధి పనులు పరిశీలన

బోడుప్పల్‌: బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. 24వ డివిజన్‌ పరిధి గణేశ్‌నగర్‌, ఇంద్రానగర్‌లో జరుగుతున్న సీసీ రోడ్డునిర్మాణ పనులను మంగళవారం కార్పొరేటర్‌ గుర్రాల రమావెంకటేశ్‌ పరిశీలించారు. 11వ డివిజన్‌ పరిధిలోని తిరుమల మెడోస్‌, లక్ష్మీగణపతి కాలనీలో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్‌ కొత్త శ్రీవిద్యాచక్రపాణిగౌడ్‌ పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు గుర్రాల వెంకటేశ్‌, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.


logo