e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం

అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం

అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం
  • నియోజకవర్గంలోఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
  • పాల్గొన్న మంత్రి, ప్రజాప్రతినిధులు
  • అమరులకు ఘన నివాళులు

మేడ్చల్‌ జోన్‌ బృందం, జూన్‌ 2: అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉన్నదని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌, దమ్మాయిగూడ, జవహర్‌నగర్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవంలో మంత్రి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా కీసరలోని అమరవీరుల స్తూపం వద్ద జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డితో కలిసి అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో 70 ఏండ్లలో జరుగని ప్రగతి ఏడేండ్లలో చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.కరోనా కట్టడికి రాష్ట్రంలో చేపట్టిన ఫీవర్‌ సర్వేను ప్రధానిమంత్రి నరేంద్రమోదీ అభినందించారన్నారు.

రాష్ట్రంలో మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి, డబ్బులను అందించి సీఎం కేసీఆర్‌ చరిత్ర సృష్టించారన్నారు. కార్యక్రమంలో మేడ్చల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ దీపికానర్సింహారెడ్డి, వైస్‌ చైర్మన్‌ రమేశ్‌, ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరాలక్ష్మీనారాయణ, ఎంపీడీవో పద్మావతి, కీసర సర్పంచ్‌ మాధురీవెంకటేశ్‌, వైస్‌ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గంలో..

అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం

మేడ్చల్‌ నియోజకవర్గంలోని ఐదు మండలాలు, మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ తల్లి విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాల వేశారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు.మేడ్చల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ పద్మజగన్‌రెడ్డి, శామీర్‌పేటలో ఎంపీపీ ఎల్లూబాయిబాబు, ఎంపీడీవో వాణీగర్దాస్‌, మూడుచింతల్‌పల్లిలో ఎంపీపీ హరికామురళిగౌడ్‌, ఎంపీడీవో సువిధ, తూంకుంట మున్సిపాలిటీ లో చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, వైస్‌ చైర్మన్‌ వాణివీరారెడ్డి, కౌన్సిలర్లు జెండా ఎగురవేశారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్‌ వెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ శివకుమార్‌గౌడ్‌, మేడిపల్లి మండల కార్యాలయంలో తహసీల్దార్‌ అనిత, డివిజన్లలో కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కీసర మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ, ఎంపీడీవో పద్మావతి, వైఎస్‌ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, మండలంలోని పంచాయతీ కార్యాలయాల వద్ద ఆయా గ్రామాల సర్పంచ్‌లు,

పోచారం, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీల్లో చైర్మన్లు కొండల్‌రెడ్డి, ముల్లిపావనీజంగయ్య యాదవ్‌, వైస్‌ చైర్మ న్లు రెడ్యానాయక్‌, మాధవరెడ్డి, ఎంపీపీ సుదర్శన్‌ రెడ్డి, కౌన్సిలర్లు, కమిషనర్లు సురేశ్‌, వసంత, అన్నోజిగూడలో పార్టీ అధ్యక్షుడు సురేందర్‌, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యాదర్శి సుధీర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌, ఘట్‌కేసర్‌ మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపీపీ సుదర్శన్‌ రెడ్డి, నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ కార్యాలయాల్లో చైర్మన్లు జాతీయ జెండాలను ఎగురవేసి గౌరవవందనం చేశారు. బోడుప్పల్‌లో మేయర్‌ సామల బుచ్చిరెడ్డి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సంజీవరెడ్డి, 28 డివిజన్లలో వేడుకలు నిర్వహించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కార్యాల యం వద్ద చైర్‌పర్సన్‌ లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, కమిషనర్‌ అమరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, గౌడవెల్లిలో ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు, నాయకులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం

ట్రెండింగ్‌

Advertisement