బుధవారం 28 అక్టోబర్ 2020
Medchal - Sep 24, 2020 , 01:11:20

ఎమ్మెల్సీ ఓటరు నమోదులో పాల్గొనాలి

ఎమ్మెల్సీ ఓటరు నమోదులో పాల్గొనాలి

 జీడిమెట్ల : రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పని చేయాలని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్‌ పిలుపునిచ్చారు. బుధవారం గాజులరామారం సర్కిల్‌ చింతల్‌ డివిజన్‌ పరిధిలోని వైఎంఎస్‌ ఫంక్షన్‌హాల్‌లో కార్పొరేటర్‌ రషీదాబేగం మహహ్మద్‌ రఫీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై దరఖాస్తు ఫారాలను అందజేశారు.  కార్పొరేటర్లు రావుల శేషగిరిరావు, జగన్‌, మంత్రి సత్యనారాయణ, చింతల్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ రఫీ, జిల్లా పరిషత్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ బి.ప్రభాకర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ జి.సురేశ్‌రెడ్డి,  మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ టి.లక్ష్మారెడ్డి, నాయకులు సాంబయ్య, విజయలక్ష్మి, ప్రభాకర్‌, వహీద్‌ పాల్గొన్నారు. 

వీధి వ్యాపారులకు అండగా ప్రభుత్వం ..

కుత్బుల్లాపూర్‌ : వీధి వ్యాపారులకు అండ గా ప్రభుత్వం నిలుస్తున్నదని  ఎమ్మెల్యే  వివేకానంద్‌ అన్నారు. బుధవారం కుత్బుల్లాపూర్‌ జంట సర్కిళ్ల పరిధిలో 596 మంది వీధి వ్యాపారులకు రూ.59.60 లక్షల స్వనిధి రుణాలను  అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సంక్షోభంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారికి జీవనోపాధిని తిరిగి పునఃప్రారంభించుకునేందుకు ప్రోత్సాహకంగా పీఎం స్వనిధి పథకం కింద రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు. ఉప కమిషనర్లు మంగతాయారు, రవీందర్‌, కార్పొరేటర్లు, యూసీడీ పీఓ మురళి, హరిప్రియ, కార్పొరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.  

సమస్యలను పరిష్కరించేలా చర్యలు.. 

కుత్బుల్లాపూర్‌, గాజులరామారం సర్కిళ్ల పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా సత్వర చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే  వివేకానంద్‌ అన్నారు. బుధవారం జోనల్‌ కమిషనర్‌ మమత, డివిజన్ల కార్పొరేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీపీ ప్రదీప్‌కుమార్‌, కార్పొరేటర్లు  రావుల శేషగిరి రావు, కొలుకుల జగన్‌, విజయ్‌ శేఖర్‌గౌడ్‌, మంత్రి సత్యనారాయణ, డివిజన్‌ అధ్యక్షుడు మహ్మద్‌ రఫీ, కేఎం గౌరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo