e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 24, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి సంఘటితంగా కృషి చేయాలి

సంఘటితంగా కృషి చేయాలి

బోడుప్పల్‌,మార్చి 6 : ఈ నెల 14న జరిగే రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమన్వయంతో,సంఘటితంగా పనిచేసి టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం బోడుప్పల్‌ నగరపాలక పరిధిలోని ఎస్‌వీఎమ్‌ గ్రాండ్‌ హోటల్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టభద్రులు టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థికి ఎందుకు ఓటు వేయాలో వివరంగా తెలియజేయాలన్నారు. ఆరేండ్లలో బీజేపీ చేసింది ఏమీలేదని, మతవిద్వేశాలు రెచ్చగొడుతూ, అబద్దాల పునాది పై రాజకీయాలు చేస్తున్నదని మంత్రి ఆరోపించారు. పారదర్శక పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్‌ నాయకత్వానికి పట్టభద్రుల నుంచి సంపూర్ణ మద్దతు పొందేందుకు ఇన్‌చార్జిలు కృషి చేయాలని సూచించారు.

వాణీదేవి గెలుపు తథ్యం : ఎంపీ వెంకటేశ్‌

విద్యావేత్త సురభి వాణీదేవి గెలుపు ఖాయమని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత అన్నారు. ఈ మేరకు మేయర్‌ సామల బుచ్చిరెడ్డి,బోడుప్పల్‌ ఎన్నికల ఇన్‌చార్జి డాక్టర్‌ ఆంజనేయులు గౌడ్‌, స్థానిక టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, పార్టీ వర్గాలు ప్రచారం ముమ్మరం చేస్తూ పట్టభద్రులను కలుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ కొత్త లక్ష్మీరవిగౌడ్‌, డాక్టర్‌ భద్రారెడ్డి , కార్పొరేటర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

వాణీదేవిని మెజార్టీతో గెలిపించాలి : శ్రీధర్‌రెడ్డి

- Advertisement -

 మేడ్చల్‌  : ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ బలపరిచిన వాణీదేవిని మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ ఎన్నికల మేడ్చల్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి శ్రీధర్‌రెడ్డి కోరారు. మేడ్చల్‌లోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావు పట్టభద్రులకు చేసిందేమీలేదని విమర్శించారు.  పట్టభద్రులు ఆలోచించి రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్న టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలువాలని కోరారు.  మేడ్చల్‌ ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ దీపికారెడ్డి, నాయకులు కౌన్సిలర్లు, పాల్గొన్నారు. 

 జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

 మేడ్చల్‌ జోన్‌ బృందం, మార్చి 6 : మేడ్చల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.  

పూడూరు, గుండ్లపోచంపల్లిలో..

మేడ్చల్‌ మండల పరిధిలోని పూడూరు జిల్లా పరిషత్‌ ఉన్నత, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి సమావేశమై, వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటే వేసి గెలిపించాలని కోరారు.  సర్పంచ్‌ బాబుయాదవ్‌, ఎంపీటీసీ నీరుడి రఘు, వార్డు సభ్యులు, పాల్గొన్నారు. గుండ్లపోచంపల్లిలో టీఆర్‌ఎస్‌ నేత మద్దుల శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు మల్లికార్జున్‌, అమరం జైపాల్‌రెడ్డి, కో ఆప్షన్‌ సభ్యుడు దేవేందర్‌ పాల్గొన్నారు.    

కీసర మండలంలో…

ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి మెజార్టీతో గెలుపొందడం ఖాయమని జడ్పీ వైస్‌ చైర్మన్‌ బెస్త వెంకటేశ్‌, ఎంపీపీ మల్లారపు ఇందిరా అన్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.  

జవహర్‌నగర్‌లో… 

 కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ప్రచారం చేశారు. ఈ మేరకు డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌ పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో కలిసి ఆయా డివిజన్‌లలో పర్యటించి ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.

నాగారం, దమ్మాయిగూడలో..

వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటువేయాలని కోరుతూ నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు ప్రచారం చేశారు. నాగారం మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుట్ల చంద్రారెడ్డి, మున్సిపల్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు తేళ్ల శ్రీధర్‌, కౌకుట్ల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శులు హరిగౌడ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

పీర్జాదిగూడలో…. 

 నగరపాలక పరిధి…15వ డివిజన్‌లో కార్పొరేటర్‌ బండారు మంజుల రవీందర్‌ స్థానిక నాయకులతో కలిసి విహారిక కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సురభి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పట్టభద్రులను అభ్యర్థించారు.  శామీర్‌పేట , మూడుచింతల్‌పల్లి మండలాలు, తూంకుంట మున్సిపాలిటీలో ఇన్‌చార్జిలు ప్రచారం చేశారు.  జడ్పీటీసీ అనితలాలయ్య,  టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి జగదీశ్‌గౌడ్‌, రాజిరెడ్డి, అల్లం శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

ఘట్‌కేసర్‌ మండలంలో…

 మండల పరిధి…కొర్రెములలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సర్పంచ్‌ ఓరుగంటి వెంకటేశ్‌ గౌడ్‌, మండల టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి బి.నాగరాజు ప్రచారం నిర్వహించారు. ఉప సర్పంచ్‌ కందుల రాజు, నాయకులు  మహింద్రాచారి, నాగార్జున, దుర్గరాజు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement