ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Medchal - Aug 15, 2020 , 00:30:19

ఆర్‌యూబీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

 ఆర్‌యూబీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

మల్కాజిగిరి : మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌ ఆర్‌యూబీని వచ్చే నెలలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌ ఆర్‌యూబీని శుక్రవారం ఎమ్మెల్యే పనులను పరిశీలించారు. పనులు చివరి దశకు చేరుకున్నాయని త్వరలోనే ప్రారంభించి ఆర్‌యూబీని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆర్‌యూబీకి ఇరు వైపులా రోడ్డు పనులు జరుగుతున్నాయని ఒక వైపు పనులు 90 శాతం పూర్తయ్యాయని తెలిపారు.  ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు జగదీశ్‌గౌడ్‌, రాజ్‌జితేంద్రనాథ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రేమ్‌కుమార్‌, జీఎన్‌వీ. సతీశ్‌కుమార్‌, పిట్ల శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.  


logo