e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి బాక్స్‌ డ్రైన్‌తో వరద ముంపునకు పరిష్కారం

బాక్స్‌ డ్రైన్‌తో వరద ముంపునకు పరిష్కారం

బాక్స్‌ డ్రైన్‌తో వరద ముంపునకు పరిష్కారం

వినాయక్‌నగర్‌, మే 30: వరదముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బాక్స్‌ డ్రైనేజీ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. వినాయక్‌నగర్‌ డివిజన్‌ దీన్‌దయాళ్‌నగర్‌ కాలనీలో రూ.2.10కోట్లతో నిర్మిస్తున్న బాక్స్‌ డ్రైనేజీ పనులకు కార్పొరేటర్‌ క్యానం రాజ్యలక్ష్మితో కలసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ప్రవహిస్తున్న నాలా కుంచించుకు పోవడంతో వర్షాకాలంలో వరదలు వచ్చి కాలనీలను ముంచెత్తుతున్నాయని అన్నారు. బాక్స్‌ డ్రైనేజీతో సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేంకుమార్‌, శ్రవణ్‌, సునీతయాదవ్‌, నాయకులు బద్దం పరశురాంరెడ్డి, పిట్ల శ్రీనివాస్‌, సతీశ్‌కుమార్‌, రాముయాదవ్‌, నిరంజన్‌, అమీనుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బాక్స్‌ డ్రైన్‌తో వరద ముంపునకు పరిష్కారం

ట్రెండింగ్‌

Advertisement