e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

వినాయక్‌నగర్‌, సెప్టెంబర్‌ 28: మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం మచ్చ బొల్లారం డివిజన్‌, శ్రీరామలింగేశ్వర కాలనీ ఎస్‌వీఎస్‌ పవన్‌ రెసిడెన్సీలో రూ.30లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలో కోట్లాది రూపాయలు వెచ్చింది సీసీ రోడ్లు, బీటీ రోడ్లు పూర్తి చేశామని అన్నారు. అధికారులతో మరోసారి సర్వే నిర్వహించి.. అవసరమైన కాలనీల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతాలోపాలు లేకుండా అధికారులు నిత్యం పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ రాజ్‌ జితేంద్రనాథ్‌, సర్కిల్‌ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, ఆనంద్‌, సురేందర్‌రెడ్డి, సూర్యకిరణ్‌, ఢిల్లీ పరమేశ్‌, నాగేశ్వర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, శోభన్‌బాబు, వెంకటేశ్‌గౌడ్‌, సురేశ్‌, రాజయ్య, షేక్‌గౌస్‌, దేవిక, సులోచన, శారద, రాఘవరావు, తులసీరామ్‌, రాజేశ్‌, రఘురామ్‌, అమర్నాథ్‌, రియాజ్‌, రాణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement