e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గం అభివృద్ధి

ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గం అభివృద్ధి

ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గం అభివృద్ధి

నేరేడ్‌మెట్‌, జూన్‌ 23: నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో సమస్య ల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని స్థానిక ఎ మ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం డివిజన్‌ పరిధి ఎరుకలబస్తీ, కిందిబస్తీల్లో రూ. 17లక్షల సీసీ రోడ్డు నిర్మాణానికి స్థానిక కార్పొరేటర్‌ కొత్తపల్లి మీనా ఉపేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ రోడ్లు, డ్రైనేజీలు, పలు రకాల అభివృద్ధి పనులకు ప్రణాళికలను రూపొందించి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల పక్షాన నిలిచి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందన్నారు. అనంతరం యాప్రాల్‌ నుంచి జవహర్‌నగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. నేటి నుంచి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రోడ్డు నిర్మాణానికి సహకరించిన ఆర్మీ అధికారులకు ఎమ్మెల్యే మైనంపల్లి ధన్యవాదాలు తెలిపారు. కా ర్యక్రమంలో ఎస్‌ఈ అనిల్‌రాజ్‌, ఈఈ లక్ష్మణ్‌, డీఈ సువర్ణ, ఏఈ సృజన, మల్కాజిగిరి సర్కిల్‌ ఉపాధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, అంజయ్య, కరంచంద్‌, జీవకన్‌, సాయికుమార్‌, సతీశ్‌కుమార్‌, ఎస్‌ఆర్‌ ప్రసాద్‌, గోపి, చెన్నారెడ్డి, శివకుమార్‌, రమేశ్‌, శ్రీనివాస్‌రెడ్డి, రాజు పాల్గొన్నారు.

సీజనల్‌ వ్యాధులను అరికడుతాం..

వినాయక్‌నగర్‌, జూన్‌ 23: దోమల ద్వారా వ్యాపించే సీజనల్‌ వ్యాధులను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం అల్వాల్‌ సర్కిల్‌ కార్యాలయంలో మలేరియా నియంత్రణ మాసోత్సవాల్లో భాగంగా ఎంటమాలజీ సిబ్బందికి 18బ్యాటరీ స్ప్రెయర్లు, ఎన్‌ 95మాస్కులు, పీపీఈ కిట్స్‌, గ్లౌజులు ఎమ్మెల్యే అందజేశారు.

పారిశుధ్య కార్మికుల ఆరోగ్య రక్షణకు చర్యలు..

- Advertisement -

పారిశుధ్య కార్మికుల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం అల్వాల్‌ సర్కిల్‌ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య రక్షణ కిట్లను ఎమ్మెల్యే అందజేశారు.

భూములను కబ్జాచేస్తే చర్యలు..

భూములను కబ్జాచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే మైనపంల్లి హన్మంతరావు హెచ్చరించారు. బుధవారం ఓల్డ్‌ అల్వాల్‌లోని ఎంహెచ్‌ఆర్‌ కాలనీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ 1996లో సర్వే నంబర్‌ 575 నుంచి 580 వరకు ఉన్న స్థలంలో కొందరు ప్లాట్లను కొని రిజిస్ట్రేషన్‌ చేసుకొని యుఎల్‌సీ కింద డబ్బును చెల్లించి క్లియరెన్స్‌ చేసుకున్నారన్నారు. 2010 ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీంలో ప్రభుత్వానికి డబ్బును చెల్లించినట్లు కూడా ఆయన తెలిపారు. కొందరు స్థలం తమదని దౌర్జన్యం చేస్తున్నారని, కోర్టులో కేసులు కూడా వేశారన్నారు. ప్లాట్లకు సంబంధించిన స్థలం విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటామన్నారు. ప్లాట్స్‌ ఓనర్లను ఇబ్బందులు పెడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా కార్యక్రమాల్లో డీసీ నాగమణి, ఏఎంహెచ్‌ఓ నిర్మల, డీఈ మహేశ్‌, ఎంటమాలజీస్ట్‌ అనిల్‌కుమార్‌, కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్‌ రెడ్డి, రాజ్‌ జితేంద్రనాథ్‌, నాయకులు అనిల్‌కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గం అభివృద్ధి
ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గం అభివృద్ధి
ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గం అభివృద్ధి

ట్రెండింగ్‌

Advertisement