e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి ఎన్నికలప్పుడే రాజకీయం.. అభివృద్ధిలో ఐకమత్యం

ఎన్నికలప్పుడే రాజకీయం.. అభివృద్ధిలో ఐకమత్యం

ఎన్నికలప్పుడే రాజకీయం.. అభివృద్ధిలో ఐకమత్యం

మల్కాజిగిరి/గౌతంనగర్‌, జూన్‌ 14: ఎన్నికలప్పు డు మాత్రమే పార్టీలు..రాజకీయాలు..అనంతరం అభివృద్ధిలో కుటుంబ సభ్యుల్లా ఐకమత్యంగా పనిచేస్తామ ని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్ప ష్టం చేశారు. సోమవారం మల్కాజిగిరి డివిజన్‌ పరిధిలోని విమలాదేవినగర్‌లో రూ 30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయబోయే వరదనీటి డ్రైనేజీ పనులను స్థాని క కార్పొరేటర్‌ ఊరపల్లి శ్రావణ్‌కుమార్‌తో, గౌతంనగర్‌ డివిజన్‌ పరిధిలోని వాణినగర్‌లో రూ.20 లక్షల వ్య యంతో నిర్మించే సామాజిక భవనం పనులకు కార్పొరేటర్‌ మేకల సునీతారాముయాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో ఎలాంటి తారతమ్యాలకు ఆస్కారం లేకుండా రాజకీయాలకు అతీతంగా నియోజక వర్గ అ భివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. కార్యక్రమాల్లో ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ కార్పొరేటర్‌ వై. ప్రేంకుమార్‌, ఈఈ లక్ష్మణ్‌, డీఈ లౌక్య, ఏఈ దీపక్‌, మాజీ కార్పొరేటర్‌ జగదీశ్‌గౌడ్‌, బీజేపీ డివిజన్‌ అధ్యక్షుడు సోమ శ్రీనివాస్‌, శివానంద్‌ గుప్తా, సదానంద్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, సర్కిల్‌ అధ్యక్ష, కార్యదర్శులు పిట్టల శ్రీనివాస్‌, జీఎన్‌వీ సతీశ్‌కుమార్‌, గుండా నిరంజన్‌, మేకల రాముయాదవ్‌ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎన్నికలప్పుడే రాజకీయం.. అభివృద్ధిలో ఐకమత్యం
ఎన్నికలప్పుడే రాజకీయం.. అభివృద్ధిలో ఐకమత్యం
ఎన్నికలప్పుడే రాజకీయం.. అభివృద్ధిలో ఐకమత్యం

ట్రెండింగ్‌

Advertisement