e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

గౌతంనగర్‌,సెప్టెంబర్‌13: రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషిచేస్తూ అభివృద్ధి పనులను చేస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం డవిజన్‌ పరిధి గాంధీనగర్‌, మౌలాలిలో మున్సిపల్‌ ఈఈ లక్ష్మణ్‌, డీఈ సువర్ణ, ఏఈ కౌశిక్‌లతో కలిసి ఆయన పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గాంధీనగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సీసీ రోడ్లు, కమ్యూనిటీహల్‌ ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వారం రోజుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతామన్నారు. గాంధీనగర్‌తో పాటు ఈస్ట్‌ప్రగతినగర్‌, భజనమందిర్‌లో కమ్యూనిటీహాల్‌ నిర్మాణాలను త్వరలోనే చేపడుతామని ఎమ్మెల్యే హమీఇచ్చారు. మౌలాలి కమాన్‌ రోడ్డు విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న భూగర్భడ్రైనేజీ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గాంధీనగర్‌కు చెందిన లోక్‌ సత్తా పార్టీ నాయకులు గున్నాల ప్రవీణ్‌గౌడ్‌ తల్లి మరణించింది.దీంతో గున్నాల ప్రవీణ్‌గౌడ్‌ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం మౌలాలి చౌరస్తాలోని వి నాయక్‌ చౌక్‌లో బీజేపీ నాయకులు లక్ష్మణ్‌గౌడ్‌ ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఎమ్మెల్యే హన్మంతరావు ప్రత్యేక పూజలు చేశారు. భరత్‌నగర్‌లో అన్నాదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు జీఎన్‌వీ సతీశ్‌కుమార్‌, ఎం.భాగ్యనందరావు, ఉస్మాన్‌, సాధిక్‌, ఆదినారాయణ, సంతోశ్‌గుప్తా, సందీప్‌గౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ఇబ్రహీం, భాస్కర్‌, చందు, సంతోష్‌రాందాస్‌, మోహన్‌రెడ్డి ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana