e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి

అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి

కుత్బుల్లాపూర్‌, జూలై26: ముంపు ప్రాంతాల్లో వరద నీటి సమస్యను, డ్రైనేజీ ఓవర్‌ఫ్లో, ఎస్టీపీల అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అధికారులకు సూచించారు. సోమవారం పేట్‌ బషీరాబాద్‌ క్యాంపు కార్యాలయంలో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌బీ, జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌, రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్‌, హెల్త్‌ అండ్‌ శానిటేషన్‌ శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. 126.76 కోట్ల నిధులతో వెన్నెలగడ్డ 5 ఎంఎల్‌డీ, గాయత్రీనగర్‌ 5ఎంఎల్‌డీ, శివాలయం నగర్‌ 14ఎంఎల్‌డీ, ఫాక్స్‌సాగర్‌ 14 ఎంఎల్‌డీ, పరికి చెరువు 28 ఎంఎల్‌డీ సామర్థ్యాలతో ఎస్టీపీ నిర్మాణ పనులను వేగంగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు తిప్పన్న, వినోద్‌, జ్ఞానేశ్వర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రఘునందన్‌, సాంబయ్య, కృష్ణచైతన్య, సునీత, భానుచందర్‌, రామ్‌చందర్‌రాజు, సంగీత, కిష్టయ్య, ప్రశాంతి, పోతారెడ్డి ఉన్నారు.

దుర్గాదేవి ఆలయంలో పూజలు

దుండిగల్‌,జూలై 26: ఆషాఢమాసం బోనాల పండుగను పురస్కరించుకుని దుండిగల్‌లోని శ్రీ దుర్గాదేవి ఆలయాన్ని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్‌, దుండిగల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుంకరి కృష్ణవేణికృష్ణ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ నాగరాజుయాదవ్‌, దుండిగల్‌ మున్సిపాలిటీ వైస్‌చైర్మన్‌ తుడుం పద్మారావు, మాజీ ఎంపీపీ చినంగి వెంకటేశం, కౌన్సిలర్లు శంభీపూర్‌కృష్ణ, జక్కుల కృష్ణాయాదవ్‌, నర్సారెడ్డి శ్రీనివాసరెడ్డి, నర్సింగం భరత్‌కుమార్‌, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

పైరవీలకు తావులేకుండా సంక్షేమ పథకాల అమలు

- Advertisement -

పైరవీలు, మోసాలకు తావులేకుండా అర్హులైన ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు దక్కుతున్నాయని ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్‌ అన్నారు. నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 39 మంది లబ్ధిదారులకు సోమవారం ప్రగతినగర్‌లోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రూ.39లక్షల4వేల 524 విలువ గల కల్యాణలక్ష్మి, షాదీముభారక్‌ చెక్కులను మేయర్‌ కొలన్‌ నీలాగోపాల్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ గోపి, డిప్యూటీ మేయర్‌ ధన్‌రాజు, బాచుపల్లి మండలం తాసీల్దార్‌ సరిత, పలువురు కార్పొరేటర్లు, లబ్ధిదారులు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. దుండిగల్‌, జూలై 26

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana