e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి ట్రాఫిక్‌ సమస్య పరిష్కారమే లక్ష్యం

ట్రాఫిక్‌ సమస్య పరిష్కారమే లక్ష్యం

ట్రాఫిక్‌ సమస్య పరిష్కారమే లక్ష్యం
  • కొంపల్లి ప్రధాన రహదారిపై అభివృద్ధికి కేంద్రానికి నివేదికలు పంపాం
  • అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తాం
  • రోడ్లు, భవనాల శాఖ మంత్రి వెల్లడి

కుత్బుల్లాపూర్‌,జూలై19:హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బోయిన్‌పల్లి నుంచి కొంపల్లి వరకు ైప్లెఓవర్‌ నిర్మాణానికి కసరత్తులు మొదలు కావడంతో సోమవారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుతో పాటు ఆయా శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ మహానగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జంక్షన్లు, ైప్లెఓవర్లు దినదినం రూపు దిద్దుకుంటున్నాయన్నారు.

ట్రాఫిక్‌, ఇతర సమస్యలకు తావునివ్వకుండా కోట్ల రూపాయలతో నూతనంగారోడ్లు, వంతెనల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు సుచిత్ర, కొంపల్లి, డెయిరీఫాం జంక్షన్ల మీదుగా జాతీయరహదారి-44పై ఆరు లేన్ల తో కూడిన ైప్లెఓవర్ల బ్రిడ్జి నిర్మాణానికి, 10 కిలోమీటర్ల మేరా 7మీటర్ల వెడల్పుతో సర్వీస్‌ రోడ్ల నిర్మాణం, ఐదు జంక్షన్ల అభివృద్ధికి రూ.475కోట్లతో పనులు జరుగుతాయన్నారు. అంతకంటే ముందుగా కేంద్రం నుంచి టెక్నికల్‌, పైనాన్సియల్‌ అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపామని, అనుమతి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఎఐ టెక్నికల్‌ మేనేజర్‌ తరుణ్‌ తగు సూచనలు, సలహాల ను అందించారు. ఆయ నవెంట ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ట్రాఫిక్‌ సమస్య పరిష్కారమే లక్ష్యం
ట్రాఫిక్‌ సమస్య పరిష్కారమే లక్ష్యం
ట్రాఫిక్‌ సమస్య పరిష్కారమే లక్ష్యం

ట్రెండింగ్‌

Advertisement