e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి దాహార్తిని తీరుస్తాం

దాహార్తిని తీరుస్తాం

దాహార్తిని తీరుస్తాం

కుత్బుల్లాపూర్‌,ఏప్రిల్‌12: భవిష్యత్‌లో శివారు ప్రాంతాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపి వివేకానంద్‌ అన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ నగర శివారు ప్రాంతాలను 3 వేల కోట్లతో అభివృద్ధి చేయాలనే యోచనలో భాగంగా సోమవారం పేట్‌ బషీరాబాద్‌ క్యాంపు కార్యాలయంలో జలమండలి విభాగం అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 200 కిలోమీటర్ల మేర పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా ఇప్పటి వరకు రూపొందించిన ప్రణాళికల్లో గోదావరి రింగ్‌ మెయిన్‌ అల్వాల్‌లో ఉన్న రిజర్వాయర్లకు పైపులైన్లు అనుసంధానం చేయాలని అన్నా రు. ఈ కార్యక్రమంలో వాటర్‌ వర్క్‌ జీఎం శ్రీధర్‌రెడ్డి, డీజీఎంలు అప్పలనాయుడు, రాజేశ్‌ ఉన్నారు.
మెరుగైన సేవలు

అందించేందుకు సిద్ధం

గాజులరామారం, ఏప్రిల్‌ 12 : ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపి వివేకానంద్‌ అన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్‌ పరిధిలోని రింగ్‌బస్తీలో రూ.19 లక్షలతో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్‌ కొలుకుల జగన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతుల కల్పనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు కొలుకుల జైహింద్‌, వేణుయాదవ్‌, మార య్య, హజ్రత్‌అలీ, బాబుగౌడ్‌, రుద్ర అశోక్‌, పాపుల్‌గౌడ్‌, మల్లారెడ్డి, యాదగిరి, సంతోష్‌ పటేల్‌ పాల్గొన్నారు.

ట్రక్‌పార్కింగ్‌ పనులను పరిశీలన

దుండిగల్‌,ఏప్రిల్‌12: గాజులరామారం సర్కిల్‌,సూరారం డివిజన్‌ పరిధి టీఎస్‌ఐఐసీ కాలనీలోని రెండున్నర ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న ట్రక్‌పార్కింగ్‌ పనులను ఎమ్మెల్యే వివేకానంద్‌ సోమవారం పరిశీలించారు. అక్కడ జరుగుతు న్న ప్రహరీ నిర్మాణం, డ్రైవర్‌ రూంలు, మరుగుదొడ్ల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. కార్పొరేటర్‌ సత్యనారాయణ, పుప్పాల భాస్కర్‌ పాల్గొన్నారు.

Advertisement
దాహార్తిని తీరుస్తాం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement