e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి సంక్షోభంలోనూ..ఆగని సంక్షేమం

సంక్షోభంలోనూ..ఆగని సంక్షేమం

సంక్షోభంలోనూ..ఆగని సంక్షేమం
  • అర్హులందరికీ పథకాలు అందిస్తాం
  • కుత్బుల్లాపూర్‌లో 94 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
  • ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు

దుండిగల్‌, జూన్‌ 5: కరోనా విపత్కర సమయంలో నూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు లోటు లేకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు అన్నారు. శనివారం నియోజకవర్గం పరిధిలోని గండిమైసమ్మ-దుండిగల్‌ మండల పరిధిలోని అర్హులైన 94 మంది లబ్ధిదారులకు రూ.94,10,904 లక్షల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితు ల్లో కూడా పేదలకు అండగా నిలుస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు.

పేదల సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్‌ నిధుల మంజూరుతో ఎంతో మంది నిరుపేదలైన అర్హుల కు లబ్ధి చేకూరుతుందన్నారు.నియోజకవర్గంలోని అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. అర్హులైన ప్రతిఒక్కరూ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగరాజ్‌యాదవ్‌, తహసీల్దార్‌ భూపాల్‌, డిప్యూటీ తహసీల్దార్‌ సుధాకర్‌, వైస్‌ చైర్మన్‌పద్మారావు, భౌరంపేట్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ బాల్‌రెడ్డి, కౌన్సిలర్లు శంభీపూర్‌ కృష్ణ, మాదాస్‌ వెంకటేశం, అనంతస్వామి, మహేందర్‌యాద వ్‌, భరత్‌కుమార్‌, ఆనంద్‌, రాముగౌడ్‌, గోపాల్‌, మాజీ సర్పంచ్‌ గణేశ్‌, నాయకులు పాల్గొన్నారు.

నిరుపేదలను ఆదుకోవడం అభినందనీయం

జీడిమెట్ల,జూన్‌ 5: కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలను ఆదుకునేందుకు హైజాక్‌ వెల్ఫేర్‌ సొసైటీ నిర్వాహకులు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అన్నారు. శనివారం కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ రంగారెడ్డినగర్‌లోని సెయింట్‌ హైజార్‌ అడ్వెంట్‌ హై స్కూల్‌లో హైజాక్‌ వెల్ఫేర్‌ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 250 మంది నిరుపేదలకు ఎమ్మెల్యే నిత్యావసరాలు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ బి.విజయ్‌శేఖర్‌గౌడ్‌, హైజాక్‌ స్కూల్స్‌ డైరెక్టర్‌ లాజరత్‌, ప్రిన్సిపాల్‌ కె.శ్యామలరావు, ఆదర్శనగర్‌ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్వ శంకరయ్య, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సంక్షోభంలోనూ..ఆగని సంక్షేమం

ట్రెండింగ్‌

Advertisement