e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి అర్హులందరికీ రేషన్‌ కార్డులు

అర్హులందరికీ రేషన్‌ కార్డులు

  • ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి
  • ఉప్పల్‌ నియోజకవర్గంలో 5, 583 మంది లబ్ధిదారులు
  • కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ

మల్లాపూర్‌, జూలై 26 : కరోనా కష్టకాలంలో బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన రేషన్‌ కార్డులు(ఆహార భద్రత కార్డు) పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. సోమవారం మీర్‌పేట్‌, హెచ్‌బీకాలనీ డివిజన్‌లోని ఫస్ట్‌ ఫేస్‌ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప్పల్‌ నియోజకవర్గంలోని 10 డివిజన్‌లకు చెందిన లబ్ధిదారులకు కొత్తరేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. కాప్రా మండల తాసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే.. లబ్ధిదారులకు రేషన్‌ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మొత్తం 9, 812 మంది రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా.. అందులో 4,229 దరఖాస్తులను తిరస్కరించగా.. 5, 583 మంది ఎంపికయ్యారన్నారు.

అడ్రస్‌లు గల్లంతై, తిరస్కరించిన దరఖాస్తుదారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. అర్హులందరికీ రేషన్‌ కార్డులు ఇస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి అవసర నిమిత్తం వెళ్లినా.. రేషన్‌ కార్డు కావాల్సిందేనని.. అందుకోసం అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డు ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పమన్నారు. ఈ కార్యక్రమంలో కాప్రా డిప్యూటీ కమిషనర్‌ శంకర్‌, ఏఎస్‌ఓ సరస్వతి, ఏఎస్‌రావునగర్‌, చర్లపల్లి, హెచ్‌బీకాలనీ, మల్లాపూర్‌, నాచారం, చిలుకానగర్‌ కార్పొటర్లు శిరీషా సోమశేఖర్‌రెడ్డి, బొంతు శ్రీదేవి, జెర్రి పోతు ల ప్రభుదాస్‌, పన్నాల దేవేందర్‌రెడ్డి, శాంతి సాయిజెన్‌శేఖర్‌, బన్నాల గీతాప్రవీణ్‌ముదిరాజ్‌, మాజీ కార్పొరేటర్లు శ్రీనివాస్‌రెడ్డి, కొత్త రామారావు, ఉద్యమ నాయకుడు కాసం మహిపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు మణిపాల్‌రెడ్డి, బాల్‌రాజ్‌, సాయికుమార్‌, నవీన్‌గౌడ్‌, కైలాస్‌, శేఖర్‌గౌడ్‌, బేతాళ బాల్‌రాజ్‌, ప్రభాకర్‌రెడ్డి, పీఆర్‌ ప్రవీ ణ్‌, క్రిష్ణవేణి, భాగ్యమ్మ, సేరి మణెమ్మ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana