సోమవారం 08 మార్చి 2021
Medchal - Sep 08, 2020 , 00:48:31

ఈఎస్‌ఐ దవాఖానలో హెల్త్‌కిట్లు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్‌

ఈఎస్‌ఐ దవాఖానలో హెల్త్‌కిట్లు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్‌

జీడిమెట్ల: కార్మికుల సంక్షేమం కోసం ఈఎస్‌ఐని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రక్షాళన చేసిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం షాపూర్‌నగర్‌లోని జీడిమెట్ల ఈఎస్‌ఐ దవాఖానలో 200మంది క్యాన్సర్‌, కిడ్ని, హృదయ సంబంధిత రోగులకు కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్‌తో కలిసి హెల్త్‌ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భం గా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సనత్‌నగర్‌, జీడిమెట్ల ఈఎస్‌ఐ దవాఖానల్లో చికిత్స పొందుతున్న క్యాన్సర్‌, కిడ్ని, హృదయ సంబంధిత రోగులకు హెల్త్‌ కిట్లతో పాటు పండ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ పూర్తి స్థాయిలో వైద్యం, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే వివేకానంద్‌ మాట్లాడుతూ కిడ్ని బాధితులకు ఇబ్బందులు లేకుండ వారి ఇంటికే ప్రతి నెల మందులను సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్మిక కుటుంబాలు ఆధైర్య పడకుండా తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూరారం డివిజన్‌ కార్పొరేటర్‌ మంత్రి సత్యనారాయణ, చింతల్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మహమ్మద్ఫ్రీ, ఈఎస్‌ఐ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ, జీడిమెట్ల ఈఎస్‌ఐ మెడికల్‌ అధికారి రవీందర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు చౌడ శ్రీనివాస్‌రావు, నాగిళ్ల శ్రీనివాస్‌, సంతోష్‌రెడ్డి, వేణుయాదవ్‌, సిద్దిఖ్‌, పుప్పాల భాస్కర్‌, డాక్టర్లు క్రాంతి సాగర్‌, మహేందర్‌, కమలతో పాటు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo