e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి పేదల సంక్షేమానికి పెద్ద పీట

పేదల సంక్షేమానికి పెద్ద పీట

  • కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
  • మేడ్చల్‌ నియోజకవర్గంలో రేషన్‌ కార్డులు పంపిణీ

మేడ్చల్‌, జూలై 26 : పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్ద పీట వేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో మేడ్చల్‌ మండలం, మేడ్చల్‌, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా మంజూరైన రేషన్‌ కార్డులను ప్రజా ప్రతినిధులతో కలిసి సోమవారం మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో కూడా పేద ప్రజలకు ఇబ్బంది కలుగకూడదని సంక్షేమ పథకాలను సీఎం అమలు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో 30,055 నూతన రేషన్‌ కార్డులు మంజూరయ్యాయని చెప్పారు. మేడ్చల్‌ రెవెన్యూ మండల పరిధిలో 475 కార్డులను అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయనందారెడ్డి, మున్సిపాలిటీల చైర్మన్‌లు దీపికా నర్సింహా రెడ్డి, లక్ష్మీ శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు, పీఏసీఎస్‌ చైర్మన్‌లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీలు, పాల్గొన్నారు.

బోడుప్పల్‌ కార్పొరేషన్‌లో..

బోడుప్పల్‌ : బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్యాలయంలో మేయర్‌ సామల బుచ్చిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరై లబ్ధిదారులకు రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. బోడుప్పల్‌కు 1,217 కొత్త కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. కమిషనర్‌ బి.శ్రీనివాస్‌, తాసీల్దార్‌ అనిత, డిప్యూటీ మేయర్‌ కొత్త లక్ష్మీరవిగౌడ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్‌ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు ..

- Advertisement -

కీసర : కీసరలోని జయమోహన్‌ గార్డెన్‌లో లబ్ధిదారులకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సోమవారం లబ్ధిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. కీసర రెవెన్యూ మండల పరిధిలో 1391 కార్డులు మంజూరయ్యాయని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ జాన్‌ శ్యాంసన్‌, ఎంపీడీఓ పద్మావతి, తాసీల్దార్‌ గౌరీవత్సల, జడ్పీ వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌, నాగారం మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుట్ల చంద్రారెడ్డి, ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ, వైస్‌ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీలో…

ఘట్‌కేసర్‌: ఘట్‌కేసర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చైర్‌పర్సన్‌ పావనీ జంగయ్య యాదవ్‌ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి లబ్ధిదారులకు సోమవారం నూతన రేషన్‌ కార్డులను అందజేశారు. ఘట్‌కేసర్‌ మండలంలోని గ్రామాలకు 286, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీకి 283, పోచారం మున్సిపాలిటీకి 252 కొత్త రేషన్‌ కార్డులు మంజూరైనట్లు తాసీల్దార్‌ విజయలక్ష్మి తెలిపారు. వైస్‌ చైర్మన్‌ మాధవ రెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌ రెడ్డి, పోచారం చైర్మన్‌ కొండల్‌రెడ్డి, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బి.శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి రాధాక్రిష్ణ, కౌన్సిలర్లు, రైతు సోసైటీ చైర్మన్‌ ఎస్‌.రాంరెడ్డి, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

శామీర్‌పేట, మూడుచింతలపల్లిలో..

శామీర్‌పేట: మూడుచింతలపల్లి, శామీర్‌పేట మండలంలోని లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి సోమవారం రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. మూడుచింతలపల్లిలో 125, శామీర్‌పేటలో 216 కార్డులను మంత్రి అందజేయగా, తూంకుంట మున్సిపాలిటీలో 160 మందికి చైర్మన్‌ కారంగుల రాజేశ్వర్‌రావు, వైస్‌ చైర్మన్‌ వాణివీరారెడ్డి, కమిషనర్‌ గంగాధర్‌ పంపిణీ చేశారు. డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, ఎంపీపీ హారికా మురళీగౌడ్‌, జడ్పీటీసీ అనితాలాలయ్య, వైస్‌ ఎంపీపీ , తాసీల్దార్లు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

నిరు పేదలకు అండగా…

పీర్జాదిగూడ : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డి ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన నూతన రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి హాజరై మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లతో కలిసి రేషన్‌ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.నగరపాలక పరిధిలో 940 మందికి రేషన్‌ కార్డులను అందజేశారు. తాసీల్దార్‌ ఎస్తేరి అనిత, కమిషనర్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ శివకుమార్‌గౌడ్‌, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana