e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి నిరుపేదలకు సంజీవని సీఎం సహాయనిధి

నిరుపేదలకు సంజీవని సీఎం సహాయనిధి

నిరుపేదలకు సంజీవని సీఎం సహాయనిధి
  • కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
  • పలువురి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ

కీసర, జూన్‌ 12: నిరుపేదలకు సీఎం సహాయనిధి సంజీవని లాంటిదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని చీర్యాల్‌, కీసర, భోగారం, తిమ్మాయిపల్లి, నర్సంపల్లి గ్రామాలకు చెందిన భరత్‌కుమార్‌కు రూ.41వేలు, కె.కృష్ణకు రూ. 49 వేలు, జి.వెంకటమ్మకు రూ. 35 వేలు, ఎం. కృష్ణకు రూ. లక్ష, కె.లక్ష్మయ్యకు రూ.25 వేలు, ఎ.విజయకు రూ. 25వేల చొప్పున సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను వారికి శనివారం మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దరఖాస్తు చేసుకొన్న ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్‌ కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు.కార్యక్రమంలో ఎంపీపీ ఇందిరలక్ష్మీనారాయణ, జడ్పీ వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌, మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో..

మేడ్చల్‌ రూరల్‌, జూన్‌ 12 : మంత్రి మల్లారెడ్డి, మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి సహకారంతో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అర్కెలగూడ గ్రామానికి చెందిన వినయ్‌గౌడ్‌కు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో అతనికి రూ.60 వేలు ఆర్థిక సహాయం మంజూరైంది. ఆ చెక్కును గుండ్లపోచంపల్లిలో శనివారం లబ్ధిదారుడికి మాజీ సర్పంచ్‌ మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు మల్లికార్జున్‌ముదిరాజ్‌, బాల్‌రాజ్‌, కమిషనర్‌ అమరేందర్‌రెడ్డి, నాయకులు సంజీవగౌడ్‌, సురేందర్‌గౌడ్‌, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నిరుపేదలకు సంజీవని సీఎం సహాయనిధి
నిరుపేదలకు సంజీవని సీఎం సహాయనిధి
నిరుపేదలకు సంజీవని సీఎం సహాయనిధి

ట్రెండింగ్‌

Advertisement