e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి కరోనా కట్టడికి మెరుగైన చర్యలు

కరోనా కట్టడికి మెరుగైన చర్యలు

కరోనా కట్టడికి మెరుగైన చర్యలు

మేడ్చల్‌ రూరల్‌, మే 29:కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభు త్వం మెరుగైన చర్యలు తీసుకుంటున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని శ్రీరంగవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్‌ కేంద్రాన్ని శనివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రజల ప్రాణాలకంటే ఎక్కువేమి కాదని రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను అమలు చేశారన్నారు. దీంతో 33, 34 శాతం ఉన్న కొవిడ్‌ కేసులు 8, 9 శాతానికి తగ్గాయన్నారు.

లాక్‌డౌన్‌తో పాటు ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందించేందుకు తీసుకున్న చర్యలు కూడా సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. శుక్రవారం నుంచి ప్రారంభించిన సూపర్‌ స్ప్రెడర్లకు టీకా పంపిణీ మంచి కార్యక్రమమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా సాగుతుందన్నారు. శ్రీరంగవరంలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్‌ కేంద్రాన్ని బాధితులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. కరోనా కష్ట కాలంలోనూ రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వానకాలం పంటలకు సరిపడా విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయానందారెడ్డి, ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి, సర్పంచ్‌ విజయానందారెడ్డి, బండమాదారం, రావల్‌కోల్‌ సర్పంచ్‌ శ్యామలాప్రభాకర్‌రెడ్డి, మహేందర్‌, ఎంపీటీసీ ప్రకాశ్‌, ఉప సర్పంచ్‌ నర్సింహ, పీఏసీఎస్‌ చైర్మన్‌ సురేశ్‌రెడ్డి, గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్‌ మల్లికార్జున్‌ ముదిరాజ్‌, ఎంపీడీవో శశిరేఖ, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ నారాయణరావు, మండల వైద్యాధికారి డాక్టర్‌ నళిని, అధికారులు అహ్మద్‌ అలీ, మహల, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, యూత్‌ అధ్యక్షుడు హరత్‌రెడ్డి, నాయకులు జగన్‌రెడ్డి, రాజిరెడ్డి, మాధవ్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, విజయ్‌, నాగార్జునరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా కట్టడికి మెరుగైన చర్యలు

ట్రెండింగ్‌

Advertisement