e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి తెలంగాణ వీరుడు సర్వాయి పాపన్న

తెలంగాణ వీరుడు సర్వాయి పాపన్న

తెలంగాణ వీరుడు సర్వాయి పాపన్న

ఘట్‌కేసర్‌, మార్చి28: తెలంగాణ ప్రజల విముక్తి కోసం పోరాట యోధుడుగా సర్దార్‌ సర్వాయి పాపన్న చరిత్రలో నిలిచాడని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. పోచారం మున్సిపాలిటీ యంనంపేట్‌ గ్రామంలో ఆదివారం సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గౌడ కులంలో పుట్టిన సర్దార్‌ పాపన్న అప్పట్లోనే అన్నివర్గాల ప్రజల సమస్యలను గుర్తించి విముక్తి కోసం పోరాడాడని తెలిపారు. ఆయన స్ఫూర్తిని నేడు విగ్రహాలు ఏర్పాటు చేసి స్మరించుకోవడం గొప్ప విశేషమని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. సర్దార్‌ సర్వాయి పాపన్న తెలంగాణ వీరుడుగా మంత్రి అభివర్ణించారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో అన్నివర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గౌడ సంఘాలకు పన్ను రద్దుచేసి సీఎం కేసీఆర్‌ ఆదుకున్నాడని మంత్రి వివరించారు. చెరువులను నీటితో నింపి రైతులను ప్రోత్సహిస్తున్నాడని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.

అన్ని కులాలకు ఆదరణ పెరిగింది

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అన్ని కులాలకు ఆదరణ పెరిగిందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని వివరించారు. గౌడ కులస్తులకు తాటి, ఈత వనం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలాలను కేటాయిస్తున్నదని అన్నారు. అన్నివర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ గౌడ్‌ ఐక్యసాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్‌, రాష్ట్ర గౌడ సంఘం నాయకులు బాలగోని బాల్‌రాజ్‌గౌడ్‌, ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి, పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్‌ శివకుమార్‌గౌడ్‌, పంజాల జైహింద్‌గౌడ్‌, శ్రావణ్‌గౌడ్‌, శివకుమార్‌గౌడ్‌, యంనంపేట్‌ గౌడ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్‌, పోచారం కౌన్సిలర్లు బాలగోని వెంకటేశ్‌ గౌడ్‌, సింగిరెడ్డి సాయిరెడ్డి, గౌడ సంఘం నాయకులు, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణ వీరుడు సర్వాయి పాపన్న

ట్రెండింగ్‌

Advertisement