e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి కార్మికుల శ్రేయస్సే.. ప్రభుత్వ ధ్యేయం

కార్మికుల శ్రేయస్సే.. ప్రభుత్వ ధ్యేయం

కార్మికుల శ్రేయస్సే.. ప్రభుత్వ ధ్యేయం

కంటోన్మెంట్‌, మే 1: కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి, పోరాడి సాధించిన గొప్ప రోజు మేడే అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం మేడే సందర్భంగా బోయిన్‌పల్లిలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగంతో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డితో కలిసి మంత్రి మల్లారెడ్డి పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్మికుల చెమట చుక్కలే ప్రపంచ నావ నడకకు ఇంధనం లాంటిదని కొనియాడారు.

కార్మికులకు ఏ సమయంలోనైనా.. ఏ అవసరం ఉన్నా తనకు చేతనైన సహాయం తక్షణం చేస్తానన్నారు. కార్మికుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంటుందని, కొవిడ్‌ కారణంగా మేడే ఘనంగా నిర్వహించలేక పోతున్నందున కొంత బాధగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీగణేశ్‌, టీఆర్‌ఎస్‌కేవీ ట్యాక్సీ సెక్టార్‌ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్‌ కుమార్‌, టాక్సీ సెక్టార్‌ విభాగం నాయకులు వీరయ్య, ఫాహీముద్దీన్‌, నరేందర్‌ గౌడ్‌, ప్రమోద్‌ రెడ్డి, రాజు, నాజీర్‌ పాల్గొన్నారు.

  • మారేడ్‌పల్లి, మే 1: మోండా డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ ఆకుల రూప శనివారం మోండా మార్కెట్‌ ఓల్డ్‌ గాంధీ ఆసుపత్రి వద్ద జెండాను ఎగురవేశారు.
  • అడ్డగుట్ట, మే 1 : మే డేను పురస్కరించుకొని అడ్డగుట్ట, తుకారాంగేట్‌ ప్రాంతాల్లో సీపీఎం నాయకులు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కిరణ్‌ కుమార్‌, రాజు, శ్రీనివాస్‌, మురళీలతో పాటు తదితరులు పాల్గొన్నారు.
  • సికింద్రాబాద్‌, మే 1: ఏఐటీయూసీ హైదరాబాద్‌ జిల్లా ఆటో యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎండీ ఉమర్‌ఖాన్‌ చిలకలగూడ, సీతాఫల్‌మండి, వారాసిగూడ తదితర ప్రాంతాల్లో శనివారం జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కే లతీఫ్‌, జె.కుమార్‌, రాములు, హరిప్రసాద్‌, లక్ష్మణ్‌, సంపత్‌కుమార్‌, కరుణాకర్‌, సాగర్‌, చందర్‌, యాదగిరి, ఆయా ఆటోస్టాండ్‌ల ఆటో డ్రైవర్‌లు పాల్గొన్నారు.
  • ఉస్మానియా యూనివర్సిటీ, మే 1: ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీల్లో ఘనంగా నిర్వహించారు. టీటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో మే డేను ఘనంగా నిర్వహించారు. టీటీయూసీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి కుమార్‌, కార్యనిర్వాహక కార్యదర్శి నానునాయక్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, శివశంకర్‌, పరశురాం తదితరులు పాల్గొన్నారు.
  • ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్‌ సి.కాశిం హాజరయ్యారు.
  • మల్కాజిగిరి, మే 1(జోన్‌బృందం) : సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీల ఆధ్వర్యంలో మల్కాజిగిరి, అల్వాల్‌, యాప్రాల్‌, నేరేడ్‌మెట్‌, మౌలాలి, గౌతంనగర్‌, వినాయక్‌నగర్‌, మచ్చబొల్లారం, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ఎర్రజెండాలను ఎగురవేసి మేడే సందేశాన్ని ఇచ్చారు. కార్యక్రమాల్లో వామపక్షాల నాయకులు కృపాసాగర్‌, సీపీఐ నాయకులు బాలమల్లేశ్‌, రొయ్యల కృష్ణమూర్తి, యాదయ్యగౌడ్‌, రవిచంద్రన్‌, మహేందర్‌, ఎం.శేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.
  • వినాయక్‌నగర్‌, మే 1: కార్మికుల హక్కులను కాపాడాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలమల్లేశ్‌ అన్నారు. శనివారం ఉదయం వినాయక్‌నగర్‌ డివిజన్‌ కాకతీయనగర్‌లోని రాష్ట్ర బిల్డింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణమూర్తి, యాదయ్య, అశోక్‌, నాగరాజు, అజీజ్‌, యాదగిరి, రాములు, వెంకటరమణ, నాగయ్య, ఆనంద్‌రావు, నారాయణ, రామాంజనేయులు, కాశిం, సుబ్బారావు ఎల్లేందర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కార్మికుల శ్రేయస్సే.. ప్రభుత్వ ధ్యేయం

ట్రెండింగ్‌

Advertisement