e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home మేడ్చల్-మల్కాజ్గిరి మహా క్రతువులో భాగస్వాములవుదాం

మహా క్రతువులో భాగస్వాములవుదాం

కీసర/మేడ్చల్‌ కలెక్టరేట్‌/బోడుప్పల్‌/జవహర్‌నగర్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌, అక్టోబర్‌ 26: యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయ పునర్నిర్మాణం, గాలి గోపురం, బంగారు తాపడం విశిష్ట క్రతువులో భాగస్వామ్యం అవుదామని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బోడుప్పల్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా మేయర్‌ బుచ్చిరెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. స్వామి వారికి విరాళాలు స్వచ్ఛందంగా ఇవ్వడానికి దాతలు ముందుకు వస్తున్నారని అన్నారు.

తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల కన్నా మిన్నగా మేడ్చల్‌ నియోజకవర్గ ప్రజల భాగస్వామ్యం గొప్పగా ఉంటుందన్నారు. భగవంతుని సేవలో తెలంగాణ ప్రజలంతా భాగస్వామ్యం కల్పించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. విరాళాలు సేకరణపై నేడు (బుధవారం) మేడ్చల్‌లో సమీక్షా సమావేశం ఉంటుందని, గురువారం ఉదయం 9:30కి ఘట్‌కేసర్‌ నుంచి బయలుదేరి యాదాద్రికి చేరుకుని విరాళాలను అందజేయనున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు ఆలయ బంగారు తాపడానికి విరాళాలు అందజేశారు. ఘట్‌కేసర్‌ మండల పరిధి కాచావాని సింగారంలో అదే గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ మండల ఎస్సీ సెల్‌ మాజీ చైర్మన్‌ పెరుమాండ్ల సుదర్శన్‌ యాదాద్రి లక్ష్మినర్సింహ స్వామి ఆలయ విమాన గోపుర నిర్మాణానికి గాను రూ.25 వేల విలువ గల చెక్కును ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌ రెడ్డికి మంగళవారం అందజేశారు.

కార్యక్రమంలో మేడ్చల్‌ జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు నందారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రామిడి ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిద్దులు యాదవ్‌, డివిజన్‌ ప్రెసిడెంట్‌ ఆనంద్‌ గైక్వాడ్‌, జనరల్‌ సెక్రటరి కుమార్‌, నాయకులు రాంచందర్‌, రాములు, సోమయ్య, రాజు, డివిజన్‌ మహిళ అధ్యక్షురాలు లక్ష్మీ, మహేశ్వరి, విమలా,నాగరాణి, సుకన్య, శ్యామ్‌ కుమార్‌, శేఖర్‌ పాల్గొన్నారు.

విరాళాలు అందజేసిన వారు..

అహ్మద్‌గూడ మాజీ ఎంపీటీసీ కొత్త శ్రీనివాస్‌ గౌడ్‌ రూ.50 వేలు
కీసర సర్పంచ్‌ నాయకపు మాధురి భర్త వెంకటేశ్‌ ముదిరాజ్‌ రూ.50 వేలు
జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ 5వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఏకే మురుగేశ్‌ ఆధ్వర్యంలో ఇంటింటికి రూ.11 చొప్పున మొత్తం రూ.53,011
అంకిరెడ్డిపల్లి ఎంపీటీసీ పండుగ కవితశశికాంత్‌ రూ.30 వేలు
కాచవాని సింగారం ఎస్సీ సెల్‌ మాజీ చైర్మన్‌ పెరుమాండ్ల సుదర్శన్‌ రూ.25 వేలు

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement