e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి పేదలకు సంజీవని సీఎం సహాయనిధి

పేదలకు సంజీవని సీఎం సహాయనిధి

మేడ్చల్‌,జూలై26:సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌ మున్సిపాలిటీలోని 4వ వార్డుకు చెందిన శంకరయ్యకు వైద్య సహాయం నిమిత్తం రూ. 30 వేలు, లక్ష్మికి రూ.50 వేలు సీఎం సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో లబ్ధిదారులకు సోమవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దీపికా నర్సింహా రెడ్డి, వైస్‌ చైర్మన్‌ రమేశ్‌, కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, గణేశ్‌, కో ఆప్షన్‌ సభ్యుడు అలీ, టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో ముగ్గురికి..

ఘట్‌కేసర్‌:ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీకి చెందిన జి.మాధవి, ఎస్‌.అంజామ్‌ కె.రాజులకు వైద్య సహాయం నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చైర్‌పర్సన్‌ పావనీ జంగయ్య యాదవ్‌ సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ సీఎం సహాయనిధి ఆపద సమయంలో ఉన్న పేద కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్నదన్నారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ మాధవ రెడ్డి, మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బి.శ్రీనివాస్‌ గౌడ్‌,ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ,కౌన్సిలర్లు ఆంజనేయులు,అనురాధ, నాగజ్యోతి, రమాదేవి, మల్లేశ్‌, వెంకట్‌రెడ్డి, నర్సింగ్‌రావు, రవీందర్‌, జాంగీర్‌, నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

దమ్మాయిగూడలో ఒకరికి..

- Advertisement -

మేడ్చల్‌ కలెక్టరేట్‌ : దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌జీకే కాలనీకి చెందిన భారతమ్మకు వైద్య సహాయం నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి రూ.18 వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ ప్రణితాశ్రీకాంత్‌ గౌడ్‌ సోమవారం అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ నరేందర్‌ రెడ్డి, కౌన్సిలర్‌ సుజాతశ్రీనివాస్‌, నాను నాయక్‌, హేమలత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana