e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి త్వరలో వెజ్‌-నాన్‌వెజ్‌ మార్కెట్ల పనులు

త్వరలో వెజ్‌-నాన్‌వెజ్‌ మార్కెట్ల పనులు

త్వరలో వెజ్‌-నాన్‌వెజ్‌ మార్కెట్ల పనులు
  • మేడ్చల్‌ జిల్లాలో 4 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు
  • రూ. 80 కోట్లు మంజూరు

మేడ్చల్‌, జూలై 19(నమస్తే తెలంగాణ): అపరిశుభ్ర వాతావరణంలో కొనుగోళ్లు చేయొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం వెజ్‌-నాన్‌వెజ్‌ సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపడుతోంది. మేడ్చల్‌ జిల్లావ్యాప్తంగా 4 కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీలకు రూ.48. 50 కోట్లు, మౌలిక సదుపాయాల కోసం రూ.31.90 కోట్ల అదనపు నిధులను మున్సిపాలిటీల నుంచి కేటాయించారు. 13 మార్కెట్ల నిర్మాణానికి 21 ఎకరాలను ఎంపిక చేయగా, నిర్మాణాల కోసం టెండర్లు ఆహ్వానించినట్లు అధికారులు వెల్లడించారు. జనాభా ఆధారంగా మార్కెట్ల నిర్మాణాలు చేయనుండగా, త్వరగా పూర్తి చేసేందుకు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతా మహంతి ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్‌ శ్యాంసన్‌ చర్యలు తీసుకుంటున్నారు.

సమీకృత మార్కెట్లకు నిధులు ఇలా..

బోడుప్పల్‌ కార్పొరేషన్‌ (రూ.7.20 కోట్లు) దుండిగల్‌ మున్సిపాలిటీ (రూ.7.20 కోట్లు), గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ (రూ.3.90 కోట్లు), జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ (రూ.7.20 కోట్లు), కొంపల్లి మున్సిపాలిటీ (రూ.3.90 కోట్లు), మేడ్చల్‌ మున్సిపాలిటీ (రూ.7.20 కోట్లు), నాగారం మున్సిపాలిటీ (రూ.7.20 కోట్లు), నిజాంపేట కార్పొరేషన్‌ (రూ.7.20 కోట్లు), పీర్జాదిగూడ కార్పొరేషన్‌ (రూ.7.20 కోట్లు), పోచారం మున్సిపాలిటీ (రూ.3.90 కోట్లు), తూంకుంట మున్సిపాలిటీ (రూ.3.90 కోట్లు), ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ (రూ.7.20 కోట్లు), దమ్మాయిగూడ మున్సిపాలిటీ (రూ.7.20 కోట్లు).

ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్మాణాలు

- Advertisement -

మేడ్చల్‌ జిల్లాలో ప్రజలకు అం దుబాటులో ఉండేలా వెజ్‌-నాన్‌వెజ్‌ సమీకృత మార్కెట్ల నిర్మాణాలు చేపడుతున్నాం. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మం జూరు చేస్తున్నది. త్వరలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. – మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
త్వరలో వెజ్‌-నాన్‌వెజ్‌ మార్కెట్ల పనులు
త్వరలో వెజ్‌-నాన్‌వెజ్‌ మార్కెట్ల పనులు
త్వరలో వెజ్‌-నాన్‌వెజ్‌ మార్కెట్ల పనులు

ట్రెండింగ్‌

Advertisement