e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి సీఎం సహాయనిధి పేదలకు సంజీవని

సీఎం సహాయనిధి పేదలకు సంజీవని

సీఎం సహాయనిధి పేదలకు సంజీవని
  • కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌ రెడ్డి
  • లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

శామీర్‌పేట, జూలై16 : సీఎం సహాయనిధి పేదలకు సంజీవని లాంటిదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండలం కేంద్రానికి చెందిన నారాయణకు వైద్య సహాయం నిమిత్తం సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.20 వేల చెక్కును శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం సహాయనిధి ద్వారా ఆపద సమయంలో ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వం ఆదుకుంటున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఘట్‌కేసర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో…

ఘట్‌కేసర్‌ : సీఎం సహాయనిధి పేదలకు వరమని ఘట్‌కేసర్‌ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌ రెడ్డి అన్నారు. వైద్య సహాయం నిమిత్తం మండల పరిధిలోని అంకుశాపూర్‌కు చెందిన యమునకు 25 వేలు, షేక్‌ హసన్‌కు 11,500, ఏదులాబాద్‌కు చెందిన నవీన్‌కుమార్‌కు 17,500, లింగమ్మకు 20 వేలు, కొర్రెములకు చెందిన మల్లికార్జున్‌కు 15వేలు సీఎం సహాయనిధి నుంచి చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను ఘట్‌కేసర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం లబ్ధిదారులకు ఎంపీపీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొర్రెముల సర్పంచ్‌ వెంకటేశ్‌ గౌడ్‌,ఎంపీటీసీ రామారావు, రైతు సొసైటీ డైరెక్టర్‌ ధర్మారెడ్డి,మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కుమార్‌, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సీఎం సహాయనిధి పేదలకు సంజీవని
సీఎం సహాయనిధి పేదలకు సంజీవని
సీఎం సహాయనిధి పేదలకు సంజీవని

ట్రెండింగ్‌

Advertisement