e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి

ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి

మేడ్చల్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 24 : రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నదని మేడ్చల్‌ జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌ చంద్రారెడ్డి అన్నారు. అందులో భాగంగా వ్యవసాయ శాఖ ద్వారా లాభసాటి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నదని తెలిపారు. ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని ప్రతాపసింగారం, ఎదులాబాద్‌ రైతు వేదికలలో పంటల మార్పిడిపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్‌ హాజరై మాట్లాడారు.

రైతులకు రైతుబంధు, రైతు బీమా పథకాల అమలుతో పాటు గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు, సకాలంలో ఎరువులు, విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తున్నదని తెలిపారు. వరికి బదులు ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను రైతులు సాగు చేసి, లాభాలను ఆర్జించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్‌ రెడ్డి, మండల రైతుబంధు సమితి కో ఆర్డినేటర్‌ అంజిరెడ్డి, అధ్యక్షుడు జిల్లా సభ్యులు భిక్షపతి గౌడ్‌, మండల ఏవో బాసిత్‌, ఏఈవో సురేశ్‌ రెడ్డి పాల్గొన్నారు.

కీసర మండలంలో …

- Advertisement -

కీసర : కీసర రైతు వేదిక భవనంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో డీఏవో మేరీరేఖ పాల్గొన్నారు. యాసంగి పంట సాగులో వరికి బదులుగా వేరుశనగ, నువ్వులు, పెసర్లు, కందులు, ఆముదాలు వేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో డాక్‌ శా్రస్త్రవేత్త ప్రవీణ్‌కుమార్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌, ఎంపీపీ ఇందిర, వైస్‌ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌ కవిత, ఎంపీటీసీ వెంకట్‌రెడ్డి, ఏవో మాధవీలత, రైతుబంధు సమితి మండల, గ్రామ కో ఆర్డినేటర్లు, మేడ్చల్‌ ఏఎంసీ డైరెక్టర్‌ సత్యనారాయణ, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

మేడ్చల్‌ మండలంలో

మేడ్చల్‌ రూరల్‌ : మండలంలోని రాయిలాపూర్‌, పూడూరు రైతు వేదిక భవనాల్లో పంటల ప్రత్యామ్నాయంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. కార్యక్రమంలో మేడ్చల్‌ ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి, ఏవో అర్చన, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ బలరాం రెడ్డి, ఏఈవోలు సుమిత, విజయ్‌, సర్పంచులు, గ్రామ రైతుబంధు సమితి కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

శామీర్‌పేట, మూడుచింతలపల్లిలో

శామీర్‌పేట : శామీర్‌పేట పరిధిలోని అలియాబాద్‌, మూడుచింతలపల్లి మండలంలోని రైతువేదిక భవనాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, సర్పంచ్‌ రవి, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్లు కృష్ణారెడ్డి, శ్యామల, ఏవోలు రమేశ్‌, కృష్ణవేణి, హెచ్‌వో శిల్ప, ఏఈవోలు రవి, జ్యోతి, సొసైటీ వైస్‌ చైర్మన్‌ ఐలయ్యయాదవ్‌, డైరెక్టర్లు , ఎంపీటీసీ అశోక్‌, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement