e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి మేకిన్‌ తెలంగాణ దిశగా అడుగులు వేయాలి

మేకిన్‌ తెలంగాణ దిశగా అడుగులు వేయాలి

కుత్బుల్లాపూర్‌, సెప్టెంబర్‌ 24: మేకిన్‌ తెలంగాణ దిశగా అడుగులు వేసేందుకు పారిశ్రామిక వేత్తలకు పూర్తి స్వేచ్ఛ ఉందని, వారి అభ్యున్నతికి కృషి చేస్తామని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఇన్‌చార్జి హరీశ్‌ అన్నారు. శుక్రవారం జీడిమెట్ల పరిశ్రమల సంఘం కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వాణిజ్య వారోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జరిగిన సదస్సులో కలెక్టర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 30 స్టాళ్లలో జిల్లాలోని ఫార్మా, ఇంజినీరింగ్‌, ఏరోస్పేస్‌, డ్రిల్‌బిట్స్‌, ప్లాస్టిక్‌ ఇతర రంగాలకు చెందిన ఉత్పత్తిదారులు తమ వస్తువులను ప్రదర్శించారు. పరిశ్రమల శాఖ అధికారులు డి.వెంకటేశ్వర్లు, ఉపసంచాలకులు కేవీ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ, కొండా బాపూజీ జయంతోత్సవాలు

మేడ్చల్‌, సెప్టెంబర్‌24(నమస్తే తెలంగాణ): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ ఆవరణలో ఈనెల 26న వీరనారి చాకలి ఐలమ్మ, 27న కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతోత్సవాలను అధికారికంగా నిర్వహించనున్నట్లు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీశ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement