మంగళవారం 27 అక్టోబర్ 2020
Medchal - Sep 26, 2020 , 00:49:59

రుణాలు మంజూరు చేయాలి : మంత్రి మల్లారెడ్డి

రుణాలు మంజూరు చేయాలి : మంత్రి మల్లారెడ్డి

 మేడ్చల్‌ కలెక్టరేట్‌ : రైతులకు, వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌ చంద్రారెడ్డి, కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లతో కలిసి మంత్రి లీడ్‌ బ్యాంకు డీసీసీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా ప్రాధాన్యతను ఇచ్చి 100 శాతం రుణాలు వెంటనే మంజూరు చేయాలని అన్నారు. మేడ్చల్‌ జిల్లా హైదరాబాద్‌ నగరానికి సమీపాన ఉన్నందున రైతులకు ఉద్యానవన పంటలు వేసుకునేందుకు రుణాలు అందించి కూరగాయ పంట లు, పూల సాగు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ జాన్‌ శ్యాంసన్‌, డీపీఆర్‌ఓ జ్యోతి, ఎల్‌డీఎం కిశోర్‌ కుమార్‌, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
logo