e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 17, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి సీసీ కెమెరాలతో మరింత భద్రత

సీసీ కెమెరాలతో మరింత భద్రత

సీసీ కెమెరాలతో మరింత భద్రత

కుత్బుల్లాపూర్‌,ఏప్రిల్‌13: ప్రజలకు భద్రతను ఇచ్చేందుకు సీసీకెమెరాల ఆవశ్యకత చాలా అత్యవసరంగా మారిందని, ప్రతి ఒక్కరు సీసీకెమెరాలను తమ ఇంటి ముందు ఏర్పాటు చేసుకొని మరింత భద్రతను పెంచుకోవాలని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్‌ అన్నారు. మంగళవారం జీడిమెట్ల డివిజన్‌ పరిధిలో భూమిరెడ్డినగర్‌ కాలనీలో హైదరాబాద్‌ వీల్స్‌, మాతృభూమి డెవలపర్స్‌ సహకారంతో రూ.2.60 లక్షల వ్యయంతో నూతనంగా కాలనీలో 21 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా వాటిని ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాలకు దాతలు ముందుకు రావడం అభినందనీమన్నారు. ఈ కార్యక్రమంలో జీడిమెట్ల ఎస్‌ఐలు మన్మథ్‌రావు, గౌతమ్‌, చంద్రశేఖర్‌, సత్యం, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు..

కుత్బుల్లాపూర్‌ గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్‌ ముఖ్యఅతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన హోమశాలను ప్రారంభించారు. అనంతరం రథశాల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement
సీసీ కెమెరాలతో మరింత భద్రత
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement