సోమవారం 06 జూలై 2020
Medchal - May 30, 2020 , 04:14:16

ఏఈవోల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

ఏఈవోల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం


మేడ్చల్‌  : జిల్లా పరిధిలో తాత్కాలిక పద్ధతిలో వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మేడ్చల్‌ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మేరీరేఖ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేయనున్న అభ్యర్థి వయస్సు 2020 మే 1వ తేదీ నాటికి 18-34 ఏండ్లలోపు ఉండాలని, దివ్యాంగులకు 10 ఏండ్ల వరకూ సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతీ నెల రూ.17,500 వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. 

అభ్యర్థుల మెరిట్‌, ఇతర మార్గదర్శకాల ద్వారా ఎంపిక ఉంటుందని, జూన్‌ 4వ తేదీలోగా మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌లోని నోటీసు బోర్డుపై ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. జిల్లాలో రెండు పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు అర్హత ఉన్న అభ్యర్థులు hr<\ @>sierra softwaresystems.com,SIERRA SOFTWARE SY STE MS AND SOLUTIONS, H.NO. 8-3-222/1/2, మధురానగర్‌, యూసుఫ్‌గూడ అడ్రస్‌కు గానీ దరఖాస్తులను జూన్‌ 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమర్పించాలన్నారు. వివరాలకు 917680022465 నంబర్‌ను సంప్రదించాలన్నారు.


logo